అక్షరటుడే, ఇందల్వాయి: Timber siege | అక్రమంగా టేకు దుంగలను తరలిస్తున్న టాటా సుమో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌ఆర్‌వో (FRO) రవి మోహన్ భట్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అటవీశాఖ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఇందల్వాయి రేంజ్ పరిధిలోని ధర్పల్లి మండలం రామడుగు (Ramadugu) శివారులో వాహనంలో టేకు దుంగలు తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఈ మేరకు టేకు దుంగలను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని ఇందల్వాయి అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌వో మాట్లాడుతూ పట్టా భూమి నుంచి కలపను తరలించాలన్నా.. అటవీశాఖ అనుమతి ఉండాలన్నారు. కలపను అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో తుకారం రాథోడ్, అటవీశాఖ సిబ్బంది అబ్దుల్ అతీక్, భాస్కర్, నవీన్ రాజ్, ఖదీర్, ప్రవీణ్, ఉదయ్ పాల్గొన్నారు.

