అక్షరటుడే, హైదరాబాద్: World Vegetarian Day | శాఖాహారులు ఎదుర్కొనే సాధారణ సమస్య తమ శరీరానికి ప్రొటీన్ ఎలా అందించాలని. ఇందుకు దిగులు చెందాల్సిన అవసరం లేదని శాఖాహారులు కూడా తమ శరీరానికి సులభంగా ప్రొటీన్స్ అందించవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.
ఏటా అక్టోబరు 1న ప్రపంచ శాఖాహార దినోత్సవం నిర్వహిస్తుంటారు. నేడు ప్రపంచ శాఖాహార దినోత్సవం సందర్భంగా శాఖాహార పాఠకుల కోసం అక్షరటుడే అందిస్తున్న ప్రత్యేక ప్రొటీన్ కథనం..
World Vegetarian Day | పోషకాల గని..పనీర్
దాబా హోటల్ అయినా రెస్టారెంట్ అయినా.. శాఖాహారులకు మొదట గుర్తుకొచ్చేది పనీర్ కర్రీ. అది బటర్ పనీర్ మసాలా, పనీర్ టిక్కా, కడాయి పనీర్.. కర్రీ ఏదైతేనేం అది పనీర్‌తో చేయిందై ఉండాలని భావిస్తుంటారు.
ఇక పనీర్ విషయానికి వస్తే.. ఇది రుచిని ఇవ్వడమే కాకుండా.. పోషకాల గనిగా పేర్కొంటారు. ఇది శాఖాహారుల పాలిట అద్భుతమైన ఆహారం.
అధిక ప్రొటీన్ protein, కాల్షియంతోపాటు ఇతర ముఖ్యమైన పోషకాలు nutrients సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆహార పదార్థం శరీర బలం, ఉల్లాసాన్ని కాపాడుకోవడంలో దోహదపడుతుంది.
నిత్యం తీసుకునే ఆహారంలో పనీర్ paneer ను చేర్చడం వల్ల పోషకాహార సమతుల్యత ఏర్పడుతుంది. దీనికితోడు శాఖాహార భోజనంలో వైవిధ్యం, అద్భుతమైన రుచిని ఆస్వాదించొచ్చు.
ప్రముఖ చెఫ్, విస్మై ఫుడ్స్ యజమాని చెఫ్ తేజ పారుచూరి Chef Teja Paruchuri పనీర్ విశిష్టతను ఇలా వివరిస్తున్నారు. పనీర్ అనేక వంటకాలలో ఉపయోగించగలిగే ఫుడ్ ఐటమ్‌గా పేర్కొంటున్నారు.
దీనిని గ్రిల్ చేసినా, సలాడ్‌లలో వేసినా, stir-fry చేసినా, కూరలలో కలిపినా.. చివరికి తీపి వంటకంలో వాడినా కూడా అద్భుతంగా ఉంటుందంటున్నారు.
పనీర్‌లో వివిధ వంటకాలను, రుచులను మేళవించడం ద్వారా దీనిని నిత్య నూతనంగా ఆస్వాదించవచ్చంటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయని చెబుతున్నారు.
ప్రపంచ శాఖాహార దినోత్సవం సందర్భంగా చెఫ్ తేజ.. గోద్రేజ్ జెర్సీ పనీర్ కుక్ బుక్ Godrej Jersey Paneer Cookbook నుంచి ఎంపిక చేసిన పనీర్ వంటకాలను, వాటి విభిన్న రుచులను ముందుకు తీసుకొస్తున్నారు.