అక్షరటుడే, ఇందూరు: Eapcet Results | ఈఏపీసెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో శ్రీవర్షిణి 1,315 ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్ విభాగంలో నిశాంత్ రెడ్డి 1,737వ ర్యాంకుతో జిల్లాలో టాపర్గా నిలిచినట్లు విద్యాసంస్థల ఛైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు. అలాగే చంద్రవదన్ రెడ్డి 2,532 ర్యాంక్, వెన్నెల 3,554, సంజన 6,218, స్నిగ్ధ 7,291, ప్రణవ్ రాజ్ 7,860, స్నాహిని 8,700 హర్షిత రెడ్డి 9,610 ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సంతోష్, గజానంద్, కార్తీక్ పాల్గొన్నారు.
