అక్షరటుడే, ఆర్మూర్: Mlc Satyam | ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో గ్రామాభివృద్ధి కమిటీల (వీడీసీ) ఆగడాలను అరికట్టాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanti Satyam) కోరారు. శాసనమండలి సమావేశాల్లో (Legislative Council sessions) భాగంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో ప్రజలపై సాగిస్తున్న దౌర్జన్యాల గురించి శాసనమండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
Village Development Committee | డివిజన్లోని పలు గ్రామాల్లో..
గ్రామాల్లో వీడీసీల పేరిట ఎస్సీ, ఎస్టీలను బీసీ వర్గాలలోని గౌడ, ముదిరాజ్, యాదవ, చాకలి, మంగలి సామాజిక వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ వివరించారు. జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు లేవన్నారు. తక్షణమే వీడీసీల ఆగడాలకు కల్లెం వేయాలని కోరారు. దీనిపై శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ స్పందిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీల దౌర్జన్యాలు అరికట్టేందుకు కలెక్టర్, పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.