ePaper
More
    HomeసినిమాLavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్నాడు. ఆయన భార్య, నటి లావణ్య త్రిపాఠి ( సెప్టెంబర్ 10, 2025 ) మగ బిడ్డ(Baby Boy)కు జన్మనిచ్చింది. రెయిన్ బో ఆసుప‌త్రి(Rainbow Hospital)లో లావ‌ణ్య డెలివ‌రీ అయిన‌ట్టు తెలుస్తుంది.

    ప్ర‌స్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని.. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి సైతం మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ సినిమా షూటింగ్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటలకి వెళ్లి వ‌రుణ్‌, లావ‌ణ్య‌ల‌కి శుభాకాంక్షలు తెలియజేసినట్టు స‌మాచారం. కాగా విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అభిమానులు, మెగా ఫ్యాన్స్, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ జంటకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

    Lavanya Tripathi | మెగా ఆనందం..

    కొద్ది రోజుల క్రితం వ‌రుణ్‌- లావ‌ణ్య‌లు ఒక అందమైన ఫొటోను షేర్ చేస్తూ తాము త‌ల్లిదండ్రులం కాబోతున్నాం అనే విష‌యం తెలియ‌జేయ‌డంతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. నెటిజన్లు కూడా వరుణ్ – లావణ్య దంపతులకు శుభాకాంక్షల వర్షం కురిపించారు. మెగా ఫ్యామిలీలో హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో హీరోగా వరుణ్ తేజ్ నిలిచాడు. పవన్ కళ్యాణ్ తర్వాత హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వ‌రుణ్ తేజ్(Varun Tej) మాత్ర‌మే. వరుణ్ – లావణ్య లవ్ స్టోరీ ఎక్కువగా ప్రచారంలోకి రాకుండా సీక్రెట్‌గానే కొనసాగింది. 2023, నవంబ‌ర్ 1న ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.

    పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ సినిమాల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 2023లో వచ్చిన ‘గాండీవధారి అర్జున’, తర్వాతి ఏడాది విడుదలైన ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ ‘మట్కా’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీతో కలిసి ‘VT-15’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా వరుణ్ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వస్తాడా? అన్నది చూడాలి.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....