ePaper
More
    HomeజాతీయంWaaree Energies | ‘వారి’వ్వా ఎనర్జీస్‌.. దుమ్మురేపిన స్టాక్‌..

    Waaree Energies | ‘వారి’వ్వా ఎనర్జీస్‌.. దుమ్మురేపిన స్టాక్‌..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Waaree Energies | వారి ఎనర్జీస్‌ లిమిటెడ్‌(Waaree Energies Ltd) కంపెనీ నాలుగో త్రైమాసికంలో దుమ్మురేపింది. నికర లాభం 34 శాతం, ఆదాయం 36 శాతం పెరిగాయి. దీంతో బుధవారం ఈ స్టాక్‌ ధర 15 శాతం పెరిగింది.

    Net profit..

    సోలార్ ప్యానెల్(Solar Panel) తయారీ సంస్థ అయిన వారీ ఎనర్జీస్ లిమిటెడ్ మంగళవారం నాలుగో త్రైమాసికానికి(4th Quarter) సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 34 వృద్ధిని సాధించి రూ. 618.9 కోట్లకు చేరుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం(Financial Year) ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.461.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

    Revenue..

    కార్యకలాపాల(Operations) ద్వారా కంపెనీ ఆదాయం 36.4 శాతం పెరిగి రూ. 4,003.9 కోట్లుగా నమోదయ్యింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 2,935.8 కోట్లుగా ఉంది.

    EBITDA, PAT..

    EBITDA 120.6 శాతం వృద్ధి చెంది రూ. 922.6 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.418.3 కోట్లు.
    PAT గత సంవత్సరంతో పోలిస్తే 107.08 శాతం పెరిగి రూ. 1,932.15 కోట్లుగా నమోదయ్యింది.
    2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 14,846 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 27.62 శాతం వృద్ధిని నమోదు చేసింది.

    Waaree Energies | స్టాక్‌ పనితీరు..

    వారీ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ గతేడాది(Last Year) అక్టోబర్‌లో లిస్టయ్యింది. ఈ స్టాక్‌ లిస్టయ్యాక భారీగా పెరిగింది. గరిష్టంగా రూ. 3,743 ల వరకు పెరిగిన స్టాక్‌ ధర.. ఇటీవలి కాలంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో రూ. 1,809 వరకు పడిపోయింది. తిరిగి కోలుకుంటున్న కంపెనీ.. ఆదివారం ఏకంగా 15 శాతం పెరగడంతో రూ. 3,008 కి చేరుకుంది.

    More like this

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....