Homeతాజావార్తలుVaranasi | సూపర్ స్టార్ మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో ‘వారణాసి’.. నందిపై శివుడి సంచారం..

Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో ‘వారణాసి’.. నందిపై శివుడి సంచారం..

మహేశ్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ‘వారణాసి’ గ్లింప్స్‌ను వైరల్ చేస్తూ సంబరాలు చేస్తున్నారు. ఈ కాంబినేషన్ మరోసారి ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను మార్చేలా ఉందని సినీ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Varanasi | సూపర్ స్టార్ మ‌హేష్‌ బాబు, దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ తో హైప్ మరింత పెరిగింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో (Ramoji Film City) జరిగిన గ్లోబ్ ట్రోటర్ గ్రాండ్ ఈవెంట్‌లో ఈ గ్లింప్స్‌ను 130 ఫీట్లు వెడల్పు, 100 ఫీట్లు ఎత్తు ఉన్న భారీ LED స్క్రీన్‌పై విడుదల చేశారు. ఈ విజువల్ ప్రెజెంటేషన్‌ను చూడటానికి వేలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Varanasi | సైన్స్, డివోషన్, హిస్టరీని కలిపిన గ్రాండ్ విజువల్

ఈవెంట్‌లో విడుదల చేసిన వీడియోలో 512 CE వారణాసి నుంచి 2027 CE మీదుగా 7200 BCE దాకా సాగిన చరిత్రాక ఘట్టాలు చూపించారు. సైన్స్, భక్తి, చరిత్ర – ఈ మూడు అంశాలను రాజమౌళి ప్రత్యేక శైలిలో మేళవించడంతో గ్లింప్స్ పూర్తిగా గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు (Superstar Mahesh Babu) ‘రుద్ర’ Rudra పాత్రలో నటిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన నందిపై విరాజిల్లుతూ, చేతిలో త్రిశూలం పట్టుకుని వస్తున్న దృశ్యాలు “న భూతో న భవిష్యతి” అన్నట్టుగా ఉన్నాయి. పరమశివుడే ప్రత్యక్షమై వస్తున్నట్లుగా విజువల్స్ ఉండటంతో అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ ఫైర్‌లో ఉన్నారు.

రాజమౌళి Rajamouli ఈవెంట్‌లో మాట్లాడుతూ ..ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలోను మహేశ్‌ను కొత్త రేంజ్‌లో చూపించబోతున్నాం” అని వెల్లడించడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. మహేశ్ బాబు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ, “వారణాసి చిత్రంలో నేను రుద్ర పాత్రలో నటిస్తున్నాను” అని పేర్కొని అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచారు. ‘GlobeTrotter’ అంటే ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు అనే అర్థం. ఈ కాన్సెప్ట్‌ను రాజమౌళి ఇప్పటికే ప్రీ-లుక్ పోస్టర్‌లోనే హింట్ ఇచ్చారు.

ఇప్పుడు చిత్రానికి అధికారికంగా ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్స్ కావడంతో ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా రామాయణాన్ని బేస్ చేసుకుని, ‘సంజీవని’ కోసం దేశమంతా తిరిగే యాత్రికుడి పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారనే ప్రచారం బలంగా నడిచింది. అయితే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ మాత్రం పూర్తిగా డైరెక్షన్ మార్చేసింది. మహేశ్ బాబు రుద్ర అవతారంలో నందిపై దిగి వస్తున్నట్టు ఉండడంతో శివుడే ప్రత్యక్షమయ్యాడా? అని అభిమానులు ఆశ్చర్యపడేలా చేసింది. దీంతో కథ ఏ దిశలో సాగుతుందో అనే విషయంలో భారీ సస్పెన్స్ నెలకొంది. ఈ ‘వారణాసి’ కథ అసలు ఏమిటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగక‌ తప్పదు.

Must Read
Related News