అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Varalaxmi Sarathkumar | మాతృత్వం మహిళ జీవితానికి పరిపూర్ణతనిస్తుందనే భావన సమాజంలో బలంగా ఉంది. అయితే మారుతున్న కాలంతో పాటు ఆలోచనల్లోనూ మార్పులు వస్తున్నాయి. కెరీర్, వ్యక్తిగత లక్ష్యాలు, జీవిత ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని కొందరు యువత పెళ్లి తర్వాత కూడా పిల్లల విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తాజాగా ఇదే అంశంపై ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ (Tollywood Star Heroine) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, తనకు పిల్లలను కనాలనే ఆలోచన లేదని స్పష్టంగా చెప్పింది. దీనికి గల కారణాలను కూడా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా వెల్లడించింది.
Varalaxmi Sarathkumar | పిల్లలు వద్దు..
అమ్మతనం అనేది చాలా పెద్ద బాధ్యత. పిల్లలను కనడమే తల్లి అవడం కాదు. నేను నా చెల్లికి తల్లిగా ఉంటాను, నా పెట్ డాగ్స్ కు తల్లిలా చూసుకుంటాను. నా స్నేహితులు, సన్నిహితులను కూడా తల్లిలా ఆదుకుంటాను. అవసరంలో ఉన్నవారికి తోడుగా నిలబడటమే నాకు అమ్మతనం అర్థం. వ్యక్తిగతంగా నాకు పిల్లలను కనాలనే ఆలోచన లేదు. అయితే భవిష్యత్‌లో ఏమైనా మారవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి కూడా వద్దనుకున్నాను అని వరలక్ష్మీ చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా (Social Media)లో విస్తృతంగా చర్చకు దారి తీశాయి. కొందరు ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ మద్దతు తెలుపుతుంటే, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక వరలక్ష్మీ నిర్ణయం వెనుక ఆమె జీవిత అనుభవాలే కారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురికావడం, తల్లిదండ్రుల విడాకులు వంటి సంఘటనలు ఆమెను మానసికంగా ప్రభావితం చేశాయని సమాచారం. తల్లి ఛాయాదేవి నుంచి విడిపోయిన తర్వాత శరత్‌కుమార్, నటి రాధిక (Actress Radhika)ను వివాహం చేసుకోవడం కూడా తన జీవితంపై ప్రభావం చూపిందని తెలుస్తోంది. తన పిల్లలు తనలా ఇబ్బందులు పడకూడదనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకుందని అభిమానులు భావిస్తున్నారు.గతేడాది నికోలాయ్ సచ్దేవ్ (Nikolay Sachdev)ను వివాహం చేసుకున్న వరలక్ష్మీ, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా మారింది. పవర్ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, తన వ్యక్తిగత నిర్ణయాలతోనూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.