అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Varalaxmi Vratham | శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉమ్మడిజిల్లాలో మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పట్టణాలతో పాటు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల్లో మూలవిరాట్టులకు విశేష అలంకరణ చేశారు. మహిళలు ఆలయాలకు పెద్దఎత్తున తరలివచ్చి సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. ఇళ్లలో వరలక్ష్మీ వ్రతాలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు.
Varalaxmi Vratham | నగరంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో..
నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో (kanyaka parameshwari temple) సుహసినులు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు.
నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో సుహాసినుల పూజలు, అమ్మవారికి నైవేద్యం




