అక్షరటుడే ఇందూరు: Nizamabad Collectorate | మహాకవి బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ‘వందే మాతరం’ (Vande Mataram) జాతీయ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో సామూహికంగా ఆలపించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి (Collector T. Vinay Krishna Reddy) ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటారు.
వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. సామూహిక గీతాలాపనలో అదనపు కలెక్టర్లు అంకిత్ (Additional Collectors Ankit), కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
