అక్షరటుడే, ఇందూరు: Vande Mataram | బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల్లో దేశభక్తిని నింపిన గేయం వందేమాతరం అని ఎంపీ అర్వింద్ (Mp Arvind) అన్నారు. వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ (RBVRR) పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం(Government of India) 150 చోట్ల ఈ కార్యక్రమాన్ని పండుగలా చేయాలని నిర్ణయించిందన్నారు.
150వ సంవత్సరాన్ని గీతాలాపనతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈనెల 26 వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన వివరించారు. అనంతరం నాయకులు, విద్యార్థులతో కలిసి స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి (Armoor MLA Paidi Rakesh Reddy), భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ (RBVRR Society) ఛైర్మన్, అధ్యక్ష కార్యదర్శులు అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
