అక్షరటుడే, వెబ్డెస్క్ : Vande Mataram Guidelines | జాతీయ గేయం వందేమాతరం (Vande Mataram) విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక నుంచి వందేమాతరం ఆరు చరణాలను పాడాలని పేర్కొంది.
కేంద్ర హోం మంత్రిత్వ (Ministry of Home Affairs) శాఖ వందేమాతరం గేయంపై నోటిఫికేషన్ జారీ చేసింది. జనగణమన కంటే ముందే వందేమాతరం పాడాలి. బంకిం చంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం 150వ సంవత్సరాన్ని పురస్కరించుకుని, జాతీయ గీతాన్ని ఆచరించడానికి సమగ్ర మార్గదర్శకాలను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అధికారిక, బహిరంగ కార్యక్రమాలలో జాతీయ గేయం, జాతీయ గీతాన్ని కలిసి పాడినప్పుడల్లా ముందుగా వందేమాతరం పాడాలని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
Vande Mataram Guidelines | ఆరు చరణాలు పాడాలి
ప్రస్తుతం పాఠశాలలు, వివిధ కార్యక్రమాల్లో వందేమాతరంలోని రెండు చరణాలు మాత్రమే పాడుతున్నారు. ఇక నుంచి ఆరు చరణాలు పాడాలని కేంద్రం పేర్కొంది. 3 నిమిషాల 10 సెకన్లలో గేయాన్ని ఆలపించాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఏకరూపత, స్పష్టతను నిర్ధారించడం కోసం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. వందేమాతరం పాడే, ప్లే చేసిన సమయంలో అందరు లేచి నిలబడాలి. జాతీయ గీతాన్ని పాడటంతో పాఠశాలలు రోజును ప్రారంభించాలని సూచించింది.