అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vande Bharat Train | వేగవంతమైన ప్రయాణం కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సకల సౌకర్యాలతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ రైళ్లకు డిమాండ్ ఉంది. అయితే భూతల స్వర్గం కశ్మీర్లో వందే భారత్ రైలు జులై నెల టికెట్లు (July Month Tickets) మొత్తం అప్పుడే బుక్ అయిపోయాయి.
Vande Bharat Train | చీనాబ్ వంతెన మీదాగా..
కశ్మీర్ లోయను మిగతా దేశంతో అనుసంధానం చేయడానికి ఇటీవల చీనాబ్ నది(Chenab River)పై రైల్వే వంతెనను ప్రధాని మోదీ(Prime Minister Modi) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మార్గంలో వందే భారత్ రైలు నడుస్తోంది. కాత్రా నుంచి శ్రీనగర్ మధ్య చీనాబ్ రైల్వే వంతెన ద్వారా వందే భారత్ రాకపోకలు సాగిస్తోంది. మూడు గంటల్లోనే 200 కిలోమీటర్ల దూరం ఈ రైలు వెళ్తోంది.
రెండు రైళ్లు రోజుకు మొత్తం నాలుగు ట్రిప్పులు నడుస్తున్నాయి. అయితే ఈ మార్గంలో సమయం ఆదా అవుతుండటంతో ఎక్కువ మంది ప్రయాణికులు దీనినే ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటం, కోచ్‌లు తక్కువగా ఉండటంతో ప్రయాణికులకు టికెట్లు దొరకడం కష్టంగా మారింది. జులై నెలకు సంబంధించిన మొత్తం టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ(Railway Department) యోచిస్తున్నట్లు సమాచారం.
Vande Bharat Train | పర్యాటకుల తాకిడి
భూతల స్వర్గం.. ప్రకృతి అందాల నెలవైన కశ్మీర్‌కు పర్యాటకులు భారీగా వస్తారు. సెలవు రోజులు, వారాంతాల్లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో వందే భారత్ ట్రైన్(Vande Bharat Train)కు రద్దీ పెరుగుతోంది. టికెట్లు ముందుగానే బుక్ అవుతున్నాయి. దీంతో కోచ్‌ల సంఖ్య పెంచాలని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Jammu Kashmir CM Omar Abdullah) ఇటీవల రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశారు.