అక్షరటుడే, హైదరాబాద్: Vande Bharat Trains | అధునాతన సాంకేతికతతో భారత రైల్వేశాఖ రూపురేఖలనే మార్చేసింది వందేభారత్ రైలు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ రైలు రాక.. భారత్ రైల్వే వ్యవస్థలో కొత్త అధ్యాయనానికి నాంది పలికింది. ఇప్పటికే పగటి వేళల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్న వందేభారత్ రైలు.. ఇక రాత్రివేలళ్లోనూ అందుబాటులోకి రాబోతోంది.
Vande Bharat Trains | తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు..
తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు రాబోతున్నట్టు సమాచారం. సరి కొత్త స్వదేశీ టెక్నాలజీతో రూపు దిద్దుకున్న వందేభారత్ స్లీపర్ కోచ్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కనున్నాయి. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు వీటిని కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. తాజాగా రైలు కోటా డివిజన్‌లో సక్సెస్ ఫుల్‌గా ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు అతిత్వరలోనే పట్టాలెక్కనున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ Union Railway Minister Ashwini Vaishnav ప్రకటించారు.
దేశవ్యాప్తంగా 136 మార్గాల్లో ప్రస్తుతం వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లకు డిమాండ్ పెరగడంతో.. వందేభారత్ స్లీపర్లను సైతం తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా 9 వందేభారత్ స్లీపర్ కోచ్లు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధంచేసుకుంది. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించే రీతిలో స్వదేశీ టెక్నాలజీతో రైల్వేశాఖ వీటిని తయారు చేసింది.
ఈ రైళ్లు 16 కోచ్ లతో మొత్తం 1,128 బెర్తులతో ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిల్లో ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ, ఏసీ త్రీ టైర్ AC First Class, Second Class AC, AC Three Tier ఉంటాయి.
తెలుగు రాష్ట్రాలకు కేటాయించే ఈ వందేభారత్ స్లీపర్లను ఏ మార్గాల్లో నడిపించాలనే దానిపై రైల్వేశాఖ ఇటీవలే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తొలి వందేభారత్ స్లీపర్ రైలు విజయవాడ నుంచి అయోధ్య / వారణాసి మార్గంలో నడవనుంది. ఈ రైలు విజయవాడ నుంచి వరంగల్ మీదుగా అయోధ్య, వారణాసి వెళ్లనుంది. మరోటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిపించాలని యోచిస్తున్నారు.