అక్షరటుడే డిచ్పల్లి: Dichpalli | డివైడర్ను ఢీకొని వ్యాన్ బోల్తా పడిన ఘటన నడిపల్లి(Nadipalli) శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్యాకింగ్ మెటీరియల్స్తో (Packing materials) నిజామాబాద్కు వస్తున్న వ్యాన్ నడిపల్లి శివారులో డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాద సమయంలో వ్యాన్ డ్రైవర్ మాత్రమే ఉండగా.. అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. వ్యాన్ ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది.