Homeజిల్లాలుకామారెడ్డిValmiki jayabthi | కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి

Valmiki jayabthi | కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి

వాల్మీకి మహర్షి అందరికీ ఆదర్శ ప్రాయుడని అడిషనల్​ ఎస్పీ నరసింహారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Valmiki jayabthi | వాల్మీకి జయంతిని కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ నరసింహారెడ్డి (Additional SP Narasimha Reddy) వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి బోధనలు సత్యం, ధర్మం, సమానత్వానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం ఆచరణాత్మకమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించినప్పుడే వాల్మీకికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీవో లింగనాయక్​, రిజర్వ్​ ఇన్​స్పెక్టర్లు సంతోష్​కుమార్​, నవీన్​, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.