Homeజిల్లాలుకామారెడ్డిGroup1 Jobs | తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం.. డీఎస్పీగా ఎంపికైన వల్లెపు మౌనిక

Group1 Jobs | తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం.. డీఎస్పీగా ఎంపికైన వల్లెపు మౌనిక

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన వల్లెపు మౌనిక గ్రూప్​1 పరీక్షల్లో డీఎస్పీ ఉద్యోగం సాధించింది. దీంతో బాన్సువాడ వాస్తవ్యుడైన జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు మౌనికను శ్రీధర్​ ఘనంగా సన్మానించారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Group1 Jobs | తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పెరిగిన మౌనిక.. ఎంతో శ్రమించి పట్టుదలతో డీఎస్పీగా (DSP) ఉద్యోగం సాధించింంది. ఈ సందర్భంగా బాన్సువాడ వాస్తవ్యుడైన జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ అభినందించారు.

గ్రూప్-1 ద్వారా డీఎస్పీగా ఎంపికైన వల్లెపు మౌనికను స్వగ్రామమైన ములుగు జిల్లా (mulugu district, ) మల్లంపల్లిలో జాతీయ వడ్డెర సంఘం(National Vaddera Association) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిట్ల శ్రీధర్​ మాట్లాడుతూ.. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మౌనిక నిరూపించిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్య అందించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు శివకుమార్, గౌరవ అధ్యక్షుడు రూపాని లోకనాథం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల భవాని, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బోదాస్ రవి, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు మక్కల ధనలక్ష్మి, పిట్ల గోపాల్, శివరాత్రి ఎల్లయ్య, వల్లెపు చంద్రశేఖర్, ఉప్పుతోల్ల కోటి, తురక వీరబాబు, ములుగు జిల్లా అధ్యక్షుడు గండికోట వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.