Homeఆంధప్రదేశ్Vallabhaneni Vamshi | జైలు నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ.. మళ్లీ గన్నవరం రాజకీయాల్లో...

Vallabhaneni Vamshi | జైలు నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ.. మళ్లీ గన్నవరం రాజకీయాల్లో యాక్టివ్!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vallabhaneni Vamshi | గుడివాడ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గత కొన్ని నెలలుగా కనిపించకపోవడంతో వంశీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ప్రచారం సాగింది.

అయితే తాజాగా తాగు నీటి ట్యాంకర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ, గన్నవరం నియోజకవర్గంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఎన్నికల అనంతరం వంశీ ఎక్కువగా ప్రజల్లో కనిపించలేదు. ప్రభుత్వం మారిన తరువాత అతనిపై 11 కేసులు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరకు ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు(AP Police) హైదరాబాద్‌లో వంశీని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన 140 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు.

Vallabhaneni Vamshi | మ‌ళ్లీ యాక్టివ్..

ఆ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన వంశీ(Vallabhaneni Vamshi), బాగా బక్కచిక్కి, గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయారు. ఆరోగ్య కారణాలతో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వంశీ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. మీడియాకు దూరంగా, రాజకీయాలకు గ్యాప్ ఇచ్చినట్టు కనిపించారు. కానీ ఇప్పుడు ఆయన తిరిగి తన నియోజకవర్గంలో ప్రత్యక్షమవుతుండటంతో, మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.వంశీ గతంలో టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో విజయవాడ ఎంపీగా బరిలోకి దిగిన ఆయన, లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 తర్వాత టీడీపీకి దూరమై, వైసీపీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu), ఆయన కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల పార్టీతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

గత ఎన్నికల్లో వంశీ వైసీపీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేసినా, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్లోనే(Hyderabad) ఉంటూ అరెస్ట్‌కు భయపడుతున్నారన్న ప్రచారం సాగింది. ఇప్పుడైతే క్ర‌మంగా కోలుకొని, రాజకీయాలకు మళ్లీ రీఎంట్రీ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు వంశీ మాత్రం తన అరెస్ట్, కేసులు, అనారోగ్యం వంటి అంశాలపై ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించలేదు. కానీ నియోజకవర్గంలో పర్యటనల ద్వారా వంశీ మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ ఇచ్చిన‌ట్టు హింట్ ఇస్తున్నారు . ఇది గన్నవరం రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి నాంది కావొచ్చని అంటున్నారు విశ్లేషకులు.