అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rajasthan Shiksha Samithi | రాజస్థాన్ శిక్షా సమితి (హరిచరణ్ మార్వాడీ స్కూల్) నూతన అధ్యక్షుడిగా వల్లభ్ సారడా ఎన్నికయ్యారు. బస్టాండ్ సమీపంలోని హరిచరణ్ మర్వాడీ స్కూల్లో (Haricharan Marwadi School) నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు, హరిచరణ్ శిక్షా ట్రస్ట్ ఛైర్మన్ ప్రేమాలత అగర్వాల్ హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులచే ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు.
Rajasthan Shiksha Samithi | ప్రతిఒక్కరికీ విద్య అందాలి..
ఈ సందర్భంగా ప్రేమలతా అగర్వాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విద్య అందించాలని, విద్యాభివృద్ధికి నూతన కమిటి పని చేయాలని సూచించారు. ఇందుకు తన వంతు సహాకారాన్ని అందిస్తానన్నారు. రాజస్థాన్ శిక్షా సమితికి మంచి పేరు ఉందని మరింతగా విద్యావ్యాప్తికి నూతన కమిటీ పనిచేయాలని కోరారు. భవిష్యతులో ఆధునిక నూతన, శాస్త్రీయ విద్యా విధానాలను ప్రవేశపెట్టాలని సూచించారు. రాజస్థాన్ శిక్షా సమతి ఆధ్వర్యంలో విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా తన పూర్తి సమయాన్ని కేటాయించి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు వల్లభ్ సారడా హామీ ఇచ్చారు.
Rajasthan Shiksha Samithi | నూతన కమిటీ ఇదే..
రాజస్థాన్ శిక్షా సమితి నూతన కమిటీ అధక్షుడిగా వల్లభ్ సారడా, ఉపాధ్యక్షుడిగా నరేష్ తివారీ, సెక్రెటరీగా జితేందర్ మాలిని, జాయింట్ సెక్రటరీగా రాజేద పాండే, కోశాధికారిగా శ్రీకాంత్ జవర్తో పాటు 15 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.