అక్షరటుడే ఇందూరు : Nizamabad Urban MLA | స్వాతంత్ర ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకపాత్ర వహించిన వ్యక్తి భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్ (Atal Bihari Vajpayee) దేశం గర్వించదగ్గ నాయకుడని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు.
వాజ్‌పేయ్ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ కార్యాలయం(Party Office)లో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం దేశాభివృద్ధి లక్ష్యంగా జన సంఘ్ పార్టీ(Jana Sangh Party) ఏర్పాటు చేసి పనిచేశారన్నారు. ఆయన నాయకత్వంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేశారన్నారు. మూడుసార్లు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సుపరిపాలన అందించి చరిత్రలో నిలిచిన నాయకుడని, రాజకీయ భీష్మ పితామహుడిగా కొనియాడారు.
నేటి యువత రాజకీయ నాయకులు వాజ్‌పేయ్‌ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు మల్లేష్ యాదవ్, మాస్టర్ శంకర్, ప్రభాకర్, కోడూరు నాగరాజు, వీరేందర్, హరీష్ రెడ్డి, పంచ రెడ్డి శ్రీధర్, పవన్, చిరంజీవి, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.