అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Medical Health Director | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ నరేంద్ర కుమార్ (State Health Director Narendra Kumar) అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులను, ప్రైమరీ హెల్త్ సెంటర్లను శనివారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చికున్ గున్యా, డెంగీ, మలేరియా వంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో (government hospitals) డాక్టర్లు, ఇతర సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర వైద్యశాఖ ఆదేశానుసారం ఆస్పత్రులను తనిఖీ చేసి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. అవసరమైన మందులు ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. ఆయన వెంట వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, ప్రభుత్వ ఆస్పతి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డాక్టర్ నాగమోహన్, డాక్టర్ సరస్వతి తదితరులున్నారు.
Medical Health Director | ఇందల్వాయి పీహెచ్‌సీని తనిఖీ చేసిన వైద్య విధాన పరిషత్ కమిషనర్
అక్షరటుడే, ఇందల్వాయి: Medical Health Director | ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ (Commissioner Ajay Kumar), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందుల వివరాలను ఫార్మసిస్ట్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ మందులను (emergency medicines) అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, పాము కాటు, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ భువనతో మాట్లాడారు.
రక్తహీనతకు హోమియో మందులు స్టాక్ ఉండేలా చూసుకోవాలన్నారు. సెల్ కౌంటర్లు రక్తానికి సంబంధించిన పూర్తి పరీక్షలు (blood tests) చేస్తున్నారా అడిగి తెలుసుకున్నారు. టీహబ్‌ను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఆస్పత్రితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. డెంగీ కేసుల వివరాలపై ఆరాతీశారు. వారి వెంట డీఎంహెచ్‌వో రాజశ్రీ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజన, అధికారులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ రాజు డాక్టర్ వెంకటేశ్ ఉన్నారు.