అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vaibhav Suryavanshi | భారత చిచ్చర పిడుగు, 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయాడు. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో 190 పరుగులతో సత్తా చాటాడు.
వైభవ్ సూర్యవంశీ ఇటీవల అండర్ 19 వరల్డ్ కప్ (Under-19 World Cup)లో రాణించిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ హాజారే ట్రోఫీలో భాగంగా బీహార్, అరుణాచల్ ప్రదేశ్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్ జట్టు (Bihar Team)వైభవ్ సూర్యవంశీ చెలరేగడంతో నిర్ణిత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 574 పరుగులు చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. వైభవ్‌తో పాటు షఖిబుల్ గని(128*), ఆయుష్ లోహారుక 116, పీయుష్ సింగ్ 77 సైతం రాణించారు.
Vaibhav Suryavanshi | 84 బంతుల్లో..
ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ ఆది నుంచి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతి చిన్న వయసులో సెంచరీతో పాటు 150 రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో డివిలియర్స్ 64 బంతుల్లో 150 రన్స్ చేయగా.. తాజాగా సూర్యవంశీ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 84 బంతుల్లో 190 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ చేస్తాడునుకునే క్రమంలో క్యాచ్ అవుట్ అయ్యారు. వైభవ్ తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 15 సిక్సులు కొట్టడం గమనార్హం. బౌండరీల ద్వారానే 154 పరుగులు చేశాడు. వైభవ్ ధాటికి అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) బౌలర్లకు చుక్కలు కనిపించాయి.
Vaibhav Suryavanshi | భారీ స్కోర్
బీహార్ బ్యాట్స్‌మెన్ మంగల్ మహోర్ 33, పియూష్ సింగ్ 77, ఆయూష్ 116, గని 128 పరుగులు చేశారు. ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం గమనార్హం. దీంతో బీహార్ జట్టు 50 ఓవర్లలో 574 పరుగులు చేసింది