అక్షరటుడే, వెబ్‌డెస్క్ :IPL 2025 | గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals) మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్ ఫైట్‌లో ఆర్ఆర్ అద్భుత విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. రాజస్థాన్ మరో 17 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. టాలెంటెడ్ కిడ్, రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) (Vaibhav Suryavanshi) అర్థశతకంతో విరుచుకుపడడంతో టార్గెట్ చేధించడం సులువు అయింది. ఈ మ్యాచ్‌లో హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు వైభవ్. 14 ఏళ్ల వయస్సులో అద్భుతంగా ఆడుతూ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు వైభవ్.
IPL 2025 | శభాష్ వైభవ్..
ఈ మధ్య మెరుపు శతకం చేసి వారెవ్వా అనిపించాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi). అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొని ఆ రీతిలో కొత్త బ్యాటర్ విరుచుకుపడటం గొప్పే. అయితే తాజాగా చెన్నైపై రాజస్థాన్ మ్యాచ్ నెగ్గడంలో హాఫ్ సెంచరీతో కీలకపాత్ర పోషించిన వైభవ్ మ్యాచ్ ముగిసిన తర్వాత తాను చేసిన చర్యతో అందరి మనసులు గెలుచుకున్నాడు. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ (Ms Dhoni) కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోగా, అది మూమెంట్ ఆఫ్ ద డేగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పతిరన బౌలింగ్‌లో సిక్స్ కొట్టి విన్నింగ్ షాట్‌తో మ్యాచ్ ముగించాడు ధృవ్ జురెల్. అనంతరం రాజస్థాన్, చెన్నై ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
ఈ క్రమంలో చెన్నై కెప్టెన్ CSK ఎంఎస్ ధోనీ తనకు ఎదురురాగానే కాళ్లకు నమస్కరించాడు రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. అప్పుడు ధోనీ సైతం వైభవ్(Vaibhav)కు ఏదో చెప్పాడు. ధోనీ ఏం చెబుతున్నాడో గమనిస్తూ షేక్ హ్యాండ్ ను కొనసాగించాడు వైభవ్. మా మనసులు గెలిచావ్ అంటూ వైభవ్ సూర్యవంశీపై చెన్నై సూపర్ కింగ్స్ సైతం పోస్ట్ చేసింది. వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 14 ఏళ్లు కాగా, ఎంఎస్ ధోనీ వయసు 44 ఏళ్లు. తనకంటే రెట్టింపు వయసు (30 ఏళ్ల ఏజ్ గ్యాప్) ఉన్న, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కాళ్లకు మొక్కి వైభవ్ ఆశీర్వాదం తీసుకోవడం క్రికెట్ ప్రేమికుల మనసులు గెలుచుకునేలా చేసింది.