అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vaibhav Suryavanshi | టీమిండియా (Team India) యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి సెంచరీతో చెలరేగాడు. అండర్ –19 ఆసియా కప్‌లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో వంద పరుగులు చేశారు.
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల ఈ కుర్రాడు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తరఫున గత సీజన్లో మంచి ప్రదర్శన చేశాడు. ఓ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్ (IPL)లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. తాజాగా వన్డే ఫార్మాట్లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ (Under-19 Asia Cup)లో వైభవ్ రాణించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ వైభవ్ 56 బంతుల్లో సెంచరీ చేశాడు. 95 బంతుల్లో 171 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
Vaibhav Suryavanshi | భారీ స్కోర్ దిశగా..
వైభవ్ సూర్యవంశీ తన సెంచరీని చేరుకోవడానికి కేవలం 56 బంతులు తీసుకున్నాడు. అతను తొమ్మిది సిక్సర్లు, ఐదు ఫోర్లు కూడా బాదాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి ఓపెనింగ్ చేసిన వైభవ్ రెండవ ఓవర్లో ఒక ఫోర్‌తో తన ఖాతాను తెరిచాడు. మూడో ఓవర్లో మాత్రే ఔట్ అయినా.. వైభవ్ పరుగుల వరద పారించాడు. 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత వేగం పెంచాడు. దీంతో డబుల్ సెంచరీ చేస్తాడని అంతా ఆశించారు. అయితే 171 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. వైభవ్ వీరవిహారంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 38 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. ఆరోన్ 69 పరుగులతో రాణించాడు.