అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vaibhav Suryavanshi Record Innings | వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్ ప్రేమికులు చర్చించుకుంటున్న పేరు. ఈ 14 ఏళ్ల చిచ్చర పిడుగు అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాట్‌తో పెద్ద విద్వంసం చేశాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మనోడి పేరు మారుమోగుతోంది.
అండర్ 19 ప్రపంచ కప్ (Under-19 World Cup)ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ యువ భారత జట్టు 100 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా (Team India) 50 ఓవర్లలో 411 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు. అందులో 15 ఫోర్లు, 15 సిక్స్‌లు ఉండటం గమనార్హం. కేవలం బౌండరీలో ద్వారానే వైభవ్ 150 పరుగులు చేశాడు. దీంతో భారత క్రికెట్ ఆటగాళ్లతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడావర్గాల్లో వైభవ్ గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఐస్లాండ్ క్రికెట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది.
Vaibhav Suryavanshi Record Innings | బౌలర్లపై హింసా
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైభవ్ పేరు ట్రెండింగ్‌లో ఉంది. అతడు క్రీజులో ఉన్నప్పుడు 20 ఓవర్లలోనే భారత స్కోర్ 200 దాటింది. ఈ దశలో ప్రొజెక్టెడ్ స్కోర్ 500కు పైగా చూపడం గమనార్హం. ఇంగ్లాండ్ బౌలర్లను వైభవ్ ఊచకోత కోశాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలకు తరలించడంతలో ఫీల్డర్లు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. ఈ క్రమంలో ఐస్లామ్ క్రికెట్ సరదాగా ట్వీట్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోసిన సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయాలని అందులో పేర్కొంది. “ఎవరైనా వైభవ్ సూర్యవంశీని అరెస్టు చేయండి. ఇంగ్లీష్ బౌలర్లపై మైదానంలో జరిగిన ఈ హింసకు ఎక్స్-రేట్ ఉంది” అని ఇస్లాండ్ క్రికెట్ సరదాగా పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ భారత క్రికెట్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. కాగా ప్రపంచ కప్ గెలిచిన యువ భారత జట్టును పలువురు అభినందించారు.