అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vaibhav Suryavanshi | ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచ కప్ 2026 (Under-19 World Cup 2026) కోసం బీసీసీఐ ఇప్పటి నుంచి సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా జూనియర్ క్రికెట్ కమిటీ దక్షిణాఫ్రికా పర్యటన, ప్రపంచ కప్ కోసం అండర్-19 జట్లను ప్రకటించింది.
అండర్ –19 ఆసియ కప్‌తో పాటు, విజయ్ హజారే ట్రోఫీలో (Vijay Hazare Trophy) సత్తా చాటిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి జట్టు పగ్గాలు అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికాలో జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతను అతనికి అప్పగించింది. దక్షిణాఫ్రికాలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించే అండర్-19 ప్రపంచ కప్‌కు ముందు ఒక కీలకమైన సన్నాహక కార్యక్రమంగా ఉపయోగపడుతుంది.
Vaibhav Suryavanshi | వన్డే సిరీస్‌కు
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు వైభవ్ సూర్యవంశి (Vaibhav Suryavanshi) కెప్టెన్‌గా ఎంపియ్యాడు. తక్కువ వయసులో అతడు కెప్టెన్‌గా నియమితుడు కావడం గమనార్హం. విజయ్ హజారే ట్రోఫీలో 84 బంతుల్లో 190 పరుగులు చేయడం, దేశవాళీ క్రికెట్లో అతని ప్రదర్శనల తర్వాత సెలెక్టర్లు అతడిపై నమ్మకంతో జట్టు పగ్గాలు అప్పగించారు. భారత్, దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనకు ఆరోన్ జార్జ్‌ను వైస్-కెప్టెన్‌గా నియమించారు.
Vaibhav Suryavanshi | ప్రపంచకప్‌కు ఆయుష్ మత్రే
దక్షిణాఫ్రికాలో(South Africa) వైభవ్ జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ, 2026లో ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచ కప్‌లో ఆయుష్ మత్రే భారత్‌కు కెప్టెన్‌గా ఉంటాడని బీసీసీఐ తెలిపింది. మత్రే ప్రస్తుతం మణికట్టు గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు అతడికి ఎంపిక చేయలేదు. దీంతో నాయకత్వ బాధ్యతలు వైభవ్‌కు అప్పగించారు. బ్యాట్స్‌మన్‌గా పరుగుల వరద పారిస్తున్న వైభవ్, కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడో చూడాలి.
Vaibhav Suryavanshi | దక్షిణాఫ్రికా పర్యటన కోసం జట్టు
వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్-కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబ్రిస్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, మహమ్మద్ అనన్, హెనిల్ పటేల్, డి. దీపేష్, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్, యువరాజ్ గోహిల్, మరియు రాహుల్ కుమార్.