అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని వడ్డేపల్లి (Vaddepalli) బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నిఖితపై సస్పెన్షన్ (Branch Post Master) వేటు పడింది. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేసినట్లు పోస్టల్ ఇన్‌స్పెక్టర్ సుజిత్ (Postal Inspector Sujith) తెలిపారు. సదరు బీపీఎం అక్రమాలకు పాల్పడడంతో ఈ విషయమై ఈనెల 10న ‘అక్షరటుడే’లో (Aksharatoday) కథనం ప్రచురితమైంది.
Nizamsagar | స్పందించిన ఉన్నతాధికారులు
ఈ మేరకు స్పందించిన అధికారులు శనివారం వడ్డేపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని పోస్టల్ కార్యాలయంలో ఖాతాదారులు, జమ చేసిన మొత్తం, ఖాతాల్లో జమకాని మొత్తం, తదితర వివరాలపై ఖాతాదారులను అడిగి ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీపీఎం నిఖితను ఈనెల 11న సస్పెండ్ చేశామని, ఖాతాదారుల నుంచి ఎంతమొత్తం డబ్బులు తీసుకున్నారో వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. వారివెంట ఎంవో వెంకట్రాంరెడ్డి, వడ్డేపల్లి ఇన్‌చార్జి బీపీఎం శశికాంత్ ఉన్నారు.
Nizamsagar | బీపీఎం చేతివాటం..
వడ్డేపల్లి గ్రామంలోని పోస్టాఫీస్‌లో గ్రామాల్లోని ఖాదారులు సుకన్య సమృద్ధి యోజనతో పాటు వివిధ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ ఉంటారు. రూ.200 నుంచి రూ.500 వరకు డబ్బులు చేస్తూ ఉండగా.. స్థానిక బీపీఎం చేతివాటం ప్రదర్శించారు. ఖాతాదారుల పుస్తకాల్లో జమ అవుతున్నట్లుగా నమోదు చేసినప్పటికీ ఆన్లైన్లో ఎంట్రీ చేయకుండా తన జేబులో వేసుకున్నారు. ఈ విషయాన్ని ‘అక్షరటుడే’ వెలుగులోకి తీసుకురాగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.