Uttar Pradesh | దారుణం.. రెండేళ్ల కుమారుడికి పురుగుల‌ మందు తాగించి.. మేడపై నుంచి తోసేసిన తండ్రి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని Uttar Pradesh చిటౌవ గ్రామంలో హృదయాలను కలిచివేసే సంఘటన చోటు చేసుకుంది. ఆ కుమారుడు తనకు పుట్టలేదన్న అనుమానంతో ఓ తండ్రి, అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారిని (child) చంపిన‌ ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కుటుంబ కలహాలతో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది . చిటౌవకు చెందిన రాజ్ బహదూర్ అనే వ్యక్తి, ఏడేళ్ల క్రితం యమునావతిని వివాహం […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని Uttar Pradesh చిటౌవ గ్రామంలో హృదయాలను కలిచివేసే సంఘటన చోటు చేసుకుంది. ఆ కుమారుడు తనకు పుట్టలేదన్న అనుమానంతో ఓ తండ్రి, అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారిని (child) చంపిన‌ ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

కుటుంబ కలహాలతో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది . చిటౌవకు చెందిన రాజ్ బహదూర్ అనే వ్యక్తి, ఏడేళ్ల క్రితం యమునావతిని వివాహం చేసుకున్నాడు. దంపతులకు అంకుశ్, లలిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

Uttar Pradesh | చిన్నారి ప్రాణం తీశాడు..

అయితే భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో రాజ్ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఒకసారి కత్తితో కూడా దాడి చేశాడు రాజ్.

తాజాగా మ‌ద్యం కోసం డబ్బులు అడిగినప్పుడు యమునావతి Yamunavati నిరాకరించడంతో గొడవ తలెత్తింది. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో రాజ్ ఇంటి గేటుకు తాళం వేసి, తన చిన్న కుమారుడు లలిత్‌ను తీసుకొని మేడమీదికి వెళ్లాడు. అక్కడ ఉన్న పురుగుల మందును బలవంతంగా కుమారుడికి తాగించి, అనంతరం మేడపై నుంచి కిందకు తోసి బలవంతంగా హతమార్చాడు.

శబ్దాన్ని గమనించిన స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి బాలుడిని తక్షణమే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

సమాచారం అందుకున్న ఎస్పీ అరుణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, పోలీసులు రాజ్‌ను Raj Bahadoor అరెస్ట్ చేయడానికి వెళ్లిన‌ప్పుడు అతను కత్తితో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

చివరకు స్థానికుల సహకారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన కుటుంబ కలహాలు, అనుమానాలు ఏ స్థాయికి తీసుకెళ్లగలవో చూపించ‌డానికి ఉదాహ‌ర‌ణ‌. ఆలోచనలపై నియంత్రణ లేకపోతే, ఓ చిన్నారి ప్రాణం ఏ విధంగా బలవుతుందో ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపుతోంది.

Related articles

Feb 24 Gold Prices | మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధ‌ర‌లు

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 24 Gold Prices | దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు ప‌రుగులు పెడుతున్నాయి.. కాస్త తగ్గుతుందని సంతోషపడ్డ వినియోగదారుల్లో...

Feb 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ

Feb 24 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని గిఫ్ట్ నిఫ్టీ...

government employees welfare schemes | ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు.. ఇకపై క్యాష్​లెస్​ వైద్యసేవలు

అక్షరటుడే, హైదరాబాద్​: government employees welfare schemes | ప్రభుత్వ ఉద్యోగుల భద్రత, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు...

February 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 24 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 24,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...