ePaper
More
    HomeజాతీయంUttar Pradesh | నోయిడాలో బైక్‌పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ల‌వ‌ర్స్.. తిక్కకుదిర్చిన పోలీసులు

    Uttar Pradesh | నోయిడాలో బైక్‌పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ల‌వ‌ర్స్.. తిక్కకుదిర్చిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | ఈ మధ్య కాలంలో ప్రేమికుల(Lovers) ఆగ‌డాలు ఎక్కువైపోతున్నాయి. మ‌నం స‌మాజంలో ఉన్నామ‌న్న విష‌యాన్నే మరిచిపోతూ విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలో (Noida Expressway) బైక్‌పై రొమాన్స్‌తో రెచ్చిపోయిన ఒక ప్రేమ జంటకు ట్రాఫిక్ పోలీసులు (traffic police) భారీ జరిమానా విధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంట రహదారిపై ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో రూ.53,500 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ సంఘటన యువతలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన లేకపోవడంపై తీవ్ర చర్చకు దారితీసింది.

    Uttar Pradesh | చెత్త ప్ర‌వ‌ర్త‌న‌..

    నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక యువ జంట బైక్‌పై ప్రమాదకరంగా ప్రవర్తిస్తూ, రొమాంటిక్ స్టంట్‌లు చేస్తున్న వీడియో సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ జంటలో ఒక‌రు హెల్మెట్ ధరించకుండా, వేగంగా బైక్ నడుపుతూ ఉండ‌గా, మ‌రొక అవత‌లి వ్య‌క్తిని కౌగిలించుకుంటూ రహదారిపై ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ జంటను గుర్తించిన పోలీసులు వారికి భారీ జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు (Uttar Pradesh Police) ఇటీవల కఠిన విధానం అవలంబిస్తున్నారు. ఈ కేసులో, హెల్మెట్ లేకపోవడం, ప్రమాదకర డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలను అతిక్రమించడం వంటి ఆరోపణల కింద ఈ జంటకు రూ.53,500 జరిమానా విధించారు.

    అంతేకాకుండా, బైక్‌ను (Bike) స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇలాంటి స్టంట్‌లు రహదారిపై ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ట్రాఫిక్ శాఖ, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. ఈ మ‌ధ్య కొంద‌రు బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేయడమే కాకుండా ఏకంగా బైకులపై డాన్స్‌లు చేయడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతున్నాయి.

    More like this

    Cyber ​​Warriors | సైబర్ నేరాల నివారణకు అవగాహనే ఆయుధం

    అక్షరటుడే, కామారెడ్డి: Cyber ​​Warriors | సైబర్ నేరాల నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధమని జిల్లా ఎస్పీ రాజేష్...

    Stock Market | లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం రేంజ్‌ బౌండ్‌లో కొనసాగింది. అయితే...

    Municipal Corporation | టౌన్ ప్లానింగ్ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

    అక్షరటుడే, ఇందూరు : Municipal Corporation | నిజామాబాద్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై కలెక్టర్...