అక్షరటుడే, ఇందూరు:Bala Bhavan | బాల భవన్లో అందించే వేసవి శిక్షణ(summer training) శిబిరాన్ని ప్రతి విద్యార్థి(Every Student) సద్వినియోగం చేసుకోవాలని డీఈవో అశోక్(DEO Ashok) సూచించారు. శుక్రవారం వేసవి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో బాలభవన్(Bala Bhavan)లో సుమారు 25 అంశాల్లో తర్ఫీదునిస్తున్నారన్నారు. ఉత్తమ విద్యార్థులుగా ఎదగడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ఉమాబాల, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.