అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి సినిమాలు రాక చాలా రోజులు అవుతుంది. అయితే ఇన్నిరోజులు వెయిట్ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్ ఆనందాన్ని పెంచేందుకు ఇప్పుడు వరుస సినిమాల సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పవన్ నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) విడుదలకు సిద్ధమైంది. జూన్ 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక ఓజీ చిత్రం(OG Movie) సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఉస్తాద్ భగత సింగ్(Ustad Bhagat Singh) అప్‌డేట్ కూడా వచ్చేసింది. జూన్ 2వ వారం నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలియజేశారు హరీష్ శంకర్. తిరుమల తిరుపతి వెళ్లిన హరీష్ శంకర్ జూన్ 2వ వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ Ustaad Bhagat Singh సినిమా షూటింగ్ మొదలు అవుతుంది అందుకే శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చామని తెలిపారు.
Pawan Kalyan | ఆగేదే లేదు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan దాదాపు రెండేళ్ల తర్వాత వెండి తెర మీద సందడి చేయబోతున్నారు. మేనల్లుడు సాయి దుర్గా తేజ్(sai Durgha Tej)తో కలిసి ఆయన నటించిన ‘బ్రో’ జూలై 28, 2023లో విడుదలైంది. ఆ తరువాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు పవన్. ‘హరి హర వీరమల్లు’తో ఈ నెల 12న థియేటర్లలోకి రానున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటారని హరీష్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో మరోసారి ఉత్సాహం నింపాయి. ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కూడా హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘గబ్బర్ సింగ్’లో Gabbar Singh వచ్చిన అంత్యాక్షరి ఎపిసోడ్ గురించి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన.. ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా ఓ ప్రత్యేకమైన మ్యూజికల్ ఎపిసోడ్ ఉంటుందని వెల్లడించారు. ఆ ఎపిసోడ్ అంత్యాక్షరి తరహాలో కాకపోయినా మ్యూజికల్ టచ్‌తో థియేటర్లు షేక్ అయ్యేలా చేస్తుందని హరీష్ శంకర్ ధైర్యంగా చెప్పారు. మొత్తానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది అని తెలిసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.