అక్షరటుడే, బోధన్ : Degree Results | తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పరిధిలో నిర్వహించిన డిగ్రీ పరీక్ష ఫలితాల్లో ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల (Ushodaya Degree College) విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని కళాశాల డైరెక్టర్ సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
Degree Results | వర్సిటీ పరిధిలో..
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫస్టియర్‌కు గాను 6,090 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో ఉషోదయ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు 10/10 జీపీఏ (GPA) సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చారని సూర్య ప్రకాష్ (College Director Surya Prakash) తెలిపారు. అదేవిధంగా మూడో సంవత్సరంలో ఓ విద్యార్థి 10/10 జేపీఏ GPA సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, మహిళా కళాశాల ప్రిన్సిపల్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.