అక్షరటుడే, గాంధారి : Kabaddi Tournament | జాతీయస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 బాలికల కబడ్డీ పోటీలకు పేట్సంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Patsangam Zilla Parishad High School) విద్యార్థిని బానోత్ ఉష ఎంపికైనట్లు హెచ్ఎం కుమార స్వామి తెలిపారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గుడివెనక తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ విఠల్, మంగతిబాయి రెండో కూతురు ఉష జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో ఆమె జాతీయస్థాయికి ఎంపికైనట్లు హెచ్ఎం తెలిపారు.
Kabaddi Tournament | రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపడంతో..
నవంబర్ 8వ తేదీ నుంచి పది వరకు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె ప్రతిభ చూపడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు హెచ్ఎం పేర్కొన్నారు. డిసెంబర్ 24 నుండి మహారాష్ట్రలోని (Maharashtra) కొపర్గావ్లో జరుగనున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టుకు ఉష ప్రాతినిథ్యం వహించనుందని పీఈటీ లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. పేద కుటుంబానికి చెందిన క్రీడాకారిణి ఉష జాతీయస్థాయికి ఎంపికకావడంతో సర్పంచ్ రవి నాయక్, ఉపసర్పంచ్ సంతోష్, గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.