HomeUncategorizedNavi Mumbai Airport | ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా యూజర్ డెవలప్‌మెంట్ ఫీ..

Navi Mumbai Airport | ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా యూజర్ డెవలప్‌మెంట్ ఫీ..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Navi Mumbai Airport | త్వరలో ప్రారంభం కానున్న నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA)లో ప్రయాణికుల నుంచి యూజర్ డెవలప్‌మెంట్ ఫీ (UDF) వసూలుకు కేంద్ర విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ సంస్థ AERA (Airports Economic Regulatory Authority) అనుమతి ఇచ్చింది. ఈ ఫీజులను తాత్కాలికంగా (అడ్-హాక్ బేసిస్‌లో) వసూలు చేయాలని AERA నిర్ణయించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి వర్తించేలా ఈ ఆదేశం అమల్లోకి వస్తుంది. ఇది 2026 మార్చి 31 లేదా స్థిర టారిఫ్ ఖరారయ్యే వరకూ కొనసాగనుంది.

Navi Mumbai Airport | అతి త్వ‌ర‌లోనే..

UDF రేట్లు ఎలా ఉండ‌నున్నాయి అంటే.. ఎగువ ప్రయాణికుల కోసం దేశవాళీ విమానాలు ₹620, అంతర్జాతీయ విమానాలు ₹1,225గా నిర్ణ‌యించారు. ఇక విమానాశ్రయంలో దిగే ప్రయాణికుల కోసం దేశవాళీ ₹270, అంతర్జాతీయం ₹525గా నిర్ణయించారు. అయితే ఈ విమానాశ్రయాన్ని నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (NMIAL) అభివృద్ధి చేస్తోంది. 2025 చివరి నాటికి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. AERA జారీ చేసిన 42 పేజీల ఉత్తర్వు ప్రకారం, ఈ తాత్కాలికంగా వసూలు చేయబడిన ఆదాయాన్ని తర్వాత స్థిర టారిఫ్ నిర్ణయం సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

నవీ ముంబయి విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ప్రయాణికులపై అదనపు భారం తప్పదు. అయితే ఇది తాత్కాలికమేనని అధికారికంగా స్పష్టం చేశారు. నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ పూర్తిగా వినియోగానికి రాగానే ఈ UDF అమల్లోకి రానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.