అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | యువత కండలు పెంచుకోవడానికి, సిక్స్ ప్యాక్ కోసం జిమ్‌లకు వెళ్తున్నారు. అయితే కష్టపడకుండానే కండలు రావడానికి కొంతమంది ఇంజెక్షన్లు వాడుతున్నారు. మరికొందరు వివిధ రకాల పౌడర్లు (రసాయనాలు) తీసుకుంటున్నారు.
జిమ్ (Gym)ల నిర్వాహకులు, కోచ్‌లు దగ్గరుండి మరి యువకులకు వీటిని ఇప్పిస్తున్నారు. ఇంజెక్షన్లతో కండలు త్వరగా పెరుగుతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad)లోని పలు జిమ్‌లలో శుక్రవారం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు తనిఖీలు చేపట్టారు. నగరంలోని జిమ్‌లలో స్టెరాయిడ్ దుర్వినియోగంపై సోదాలు చేపట్టారు.
Hyderabad | 20 జిమ్‌లలో..
సికింద్రాబాద్ (Secunderabad), బంజారాహిల్స్ (Banjarahills), జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మాదాపూర్ ఇతర ప్రాంతాలలోని 20 జిమ్‌లలో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పోటీ క్రీడలు, బాడీబిల్డింగ్‌లో శారీరక పనితీరును మెరుగుపరచడానికి జిమ్‌లకు వెళ్లేవారికి కొన్ని జిమ్‌లు మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్‌ను అక్రమంగా విక్రయిస్తున్నాయి. బాడీబిల్డింగ్ కోసం అనాబాలిక్ స్టెరాయిడ్స్, మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్లను అక్రమంగా అమ్ముతున్నట్లు గుర్తించారు. గతంలో పలు జిమ్‌ల నిర్వాహకులు వీటిని విక్రయిస్తూ దొరికారు. ఈ క్రమంలో తాజాగా అధికారులు సోదాలు చేపట్టారు.
Hyderabad | గుండెపోటు ముప్పు
ప్రస్తుతం యువత సినిమాలను చూసి కండలు, సిక్స్ ప్యాక్ కోసం జిమ్‌లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎంతకు అవి రాకపోవడంతో జిమ్ కోచ్‌లు చెప్పినట్లు ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. అయితే వీటితో ప్రాణాలకే ముప్పు పొంచి ఉంది. అనాబాలిక్ స్టెరాయిడ్స్, మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్ల (Mephentermine injections)ను బయట విక్రయించడం నిషేధం. వీటిని వాడితో గుండె, కాలేయం, హార్మోన్ల సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కొంతమంది జిమ్‌ల నిర్వాహకులు వీటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. అధికారులు తనిఖీలు చేసి జిమ్ నిర్వాహకులను హెచ్చరించారు. మెఫెంటెర్మిన్ ఇంజెక్షన్లు వినియోగిస్తే డ్రగ్స్, కాస్మెటిక్స్ చట్టం కింద 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. జిమ్‌లలో వీటిని వినియోగించినట్లు గుర్తిస్తే 1800-599-6969 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

