అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో వైట్ హౌస్‌లో శనివారం బరువు తగ్గించే మందుల ధరల తగ్గింపు పై ముఖ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల (Pharmaceutical Companies) అధిపతులు, ప్రతినిధులు హాజరయ్యారు.
అయితే, సమావేశం జరుగుతున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఒక ఫార్మా కంపెనీ ప్రతినిధి సడెన్‌గా తల తిరగడంతో స్పృహ తప్పి నేలపై పడిపోయారు. ఆ వ్యక్తి ట్రంప్‌కు సమీపంగా కూర్చున్నారని సమాచారం. అదే సమయంలో, కొంతమంది మీడియా ఫోటోల్లో ట్రంప్ కాస్త అలసటతో కూర్చున్నట్టు కనిపించడంతో సోషల్ మీడియా (Social Media)లో విమర్శలు వెల్లువెత్తాయి.
Donald Trump | కళ్లు తిరిగి పడిపోవడంతో..
మాజీ ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఎలిజబెత్ డే లా వేగా ట్విట్టర్ (X) లో, “ట్రంప్ (Donald Trump) మీటింగ్ సమయంలో సగం నిద్రలో ఉన్నాడు. ఇంత ముఖ్యమైన సందర్భంలో ఇలాంటి నిర్లక్ష్యం అధ్యక్షుడికి తగదు” అంటూ విమర్శించారు. వైట్ హౌస్ (White House) వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, పడిపోయిన ప్రతినిధి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. మీటింగ్‌లో పాల్గొన్నవారు వెంటనే సహాయం చేయడంతో అతను తేరుకున్నాడు. వైట్ హౌస్ సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్ నిర్వాహకుడు మెహ్మెట్ ఓజ్ కూడా ఆయనను పరీక్షించి, ఎటువంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు.
వైద్యుల అంచనా ప్రకారం, 30 నిమిషాల పాటు నిల్చుని ఉండటమే తాత్కాలిక తల తిరుగుదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటన కారణంగా ట్రంప్ కార్యక్రమం దాదాపు గంటసేపు నిలిచిపోయింది. వైట్ హౌస్ భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకున్న తర్వాత మీటింగ్ మళ్లీ ప్రారంభమైంది. కాగా, త్వరలో భారత్ పర్యటనకు వస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది భారత్ పర్యటన ఉండొచ్చని, భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) గొప్ప వ్యక్తి అని, తనకు మంచి స్నేహితుడని తెలియజేశారు. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల బలోపేతం లక్ష్యంగా చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని వివరించారు. అమెరికా చెప్పిన విధంగానే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను మోదీ క్రమంగా తగ్గిస్తున్నారని కూడా ట్రంప్ ఈ సందర్భంగా తెలియజేశారు.
