అక్షరటుడే, వెబ్డెస్క్: JD Vance | భారత పర్యటనకు వచ్చిన జేడీ వాన్స్ JD Vance సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ PM modi నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా US vice president బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వాన్స్ తన భార్య పిల్లలతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. సోమవారం ఉదయం ఆయన ఢిల్లీ Delhi చేరుకోగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ union minister ashwini vaishnav స్వాగతం పలికారు.
పర్యటనలో భాగంగా వాన్స్ సాయంత్రం ప్రధానితో సమావేశం అయ్యారు. భారత్- అమెరికా Bharat- US మధ్య ద్వైపాక్షిక చర్చలు, ఆర్థిక, వాణిజ్యం, భౌగోళిక రాజకీయ సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. భేటీ అనంతరం ప్రధాని మోదీ, వాన్స్ దంపతులతో పాటు అమెరికా అధికారులకు ప్రత్యేక విందు special dinner ఇవ్వనున్నారు.