Homeబిజినెస్​Stock Markets | యూఎస్‌ స్ట్రైక్స్‌ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Markets | యూఎస్‌ స్ట్రైక్స్‌ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Markets | ఇరాన్‌పై యూఎస్‌(US) ప్రత్యక్ష దాడులకు దిగడం, హర్మూజ్‌ జలసంధి(Strait of Hormuz)ని మూసివేయాలని ఇరాన్‌ పార్లమెంట్‌ తీర్మానించడంతో ముడి చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి. దీంతో షాంఘై మినహా ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో సాగుతున్నాయి. మన మార్కెట్లూ వీటిని అనుసరిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ భయాలతో సోమవారం ఉదయం 704 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన సెన్సెక్స్‌ (Sensex).. అక్కడినుంచి మరో 228 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ (Nifty) 173 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 115 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో కాస్త కోలుకుని సెన్సెక్స్‌ 542 పాయింట్ల నష్టంతో 81,877 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 24,960 వద్ద కొనసాగుతున్నాయి.

అమెరికా ప్రత్యక్ష దాడితో ఇరాన్‌(Iran), ఇజ్రాయెల్‌ల (Israel) మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌ ప్రతిదాడులు చేస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. మరోవైపు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేసే దిశగా ఇరాన్‌ సాగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ముడి చమురు(Crude oil) ధరలు ఆకాశాన్నంటే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ జలసంధి ద్వారానే జరుగుతోంది. హర్మూజ్‌ను మూసివేస్తే చమురు కొరత ఏర్పడి ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండడంతో మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

Stock Markets | ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి..

ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్‌ఈ(BSE)లో ఐటీ ఇండెక్స్‌ 1.35 శాతం పడిపోగా.. ఆటో సూచీ 0.96 శాతం నష్టంతో కదలాడుతోంది. బ్యాంకెక్స్‌ 0.66 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.48 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 0.43 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.56 శాతం లాభంతో ఉంది. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 0.17 శాతం లాభంతో ఉండగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.62 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.05 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Stock Markets | Top gainers..

బీఎస్‌ఈలో 6 కంపెనీలు లాభాలతో ట్రేడ్‌ అవుతుండగా.. 24 కంపెనీలు నష్టాల బాటలో ఉన్నాయి. బీఈఎల్‌(BEL) 2.57 శాతం, ట్రెంట్‌ 2.29 శాతం, ఎటర్నల్‌ 0.55 శాతం, ఎయిర్‌టెల్‌ 0. 52శాతం, అదానిపోర్ట్స్‌ 0.39 శాతం లాభాలతో ఉన్నాయి.

Stock Markets | Top losers..

ఇన్ఫోసిస్‌(Infosys) 2.11 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.73 శాతం, హెచ్‌యూఎల్‌ 1.45 శాతం, ఎంఅండ్‌ఎం 1.32 శాతం, టీసీఎస్‌ ఒక శాతం నష్టంతో కొనసాగుతున్నాయి.