HomeUncategorizedAdani Group | వివాదంలో చిక్కుకున్న అదానీ గ్రూప్.. ఎల్‌పీజీ దిగుమ‌తుల‌పై అమెరికా సీరియ‌స్

Adani Group | వివాదంలో చిక్కుకున్న అదానీ గ్రూప్.. ఎల్‌పీజీ దిగుమ‌తుల‌పై అమెరికా సీరియ‌స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Adani Group | గౌతమ్‌ అదానీ గ్రూప్‌ (Adani Group) మరోసారి వివాదాల్లో చిక్కుకున్న‌ట్టుగా తెలుస్తుంది. గుజరాత్‌లోని తన ముంద్రా రేవు ద్వారా కొన్ని కంపెనీలు ఇరాన్‌ ఎల్‌పీజీ(Iran LPG) దిగుమతి చేసుకునేందుకు సహకరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో అమెరికా దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌(Wall Street Journal) ఒక కథనం ప్రచురించింది. అయితే అదానీ గ్రూప్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇరాన్‌ నౌకలు ఏవీ కూడా ఎల్‌పీజీతో తమ రేవులకు రాలేదని పేర్కొంది. ఒక‌వైపు అమెరికా సంస్థలు దర్యాప్తు జరుపుతున్న విషయం కూడా తమకు తెలియదని తెలిపింది.

Adani Group | అలాంటిదేమి లేదు..

కొన్నిసంస్థలు దురుద్దేశాలతో తమపై కావాలనే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ప్రచారం చేస్తున్నాయని అదానీ గ్రూప్‌ తెలిపింది. ‘మా రేవుల ద్వారా ఇరాన్‌ నుంచి వచ్చే ఎలాంటి సరుకుల ఎగుమతి, దిగుమతులను అనుమతించడం లేదు. అది మా విధానపరమైన నిర్ణయం. ఇరాన్‌ జెండాతో Iran flag వచ్చే నౌకలు లేదా నేరుగా ఇరాన్‌ రేవుల నుంచి వచ్చే నౌకలు అన్నిటికి ఇది వర్తిస్తుంది’ అని తెలిపింది. దేశంలో రుణ విభాగాన్ని ఉత్తేజితం చేయడంతో పాటు పలు రకాల అస్థిరతలను దీటుగా ఎదుర్కొనగల శక్తి కల్పించడం కోసం రిజర్వ్‌ బ్యాంక్‌(Reserve Bank) ఈసారి అర శాతం మేరకు రెపోరేటును తగ్గించవచ్చని ఎస్‌బీఐ(SBI) అంచనా వేస్తోంది.

మ‌రోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani) వచ్చే ఐదేళ్లలో వివిధ వ్యాపారాల్లో 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టు బడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ బలమైన బ్యాలెన్స్ షీట్లు, బిజినెస్ వృద్ధిని కలిగి ఉందని తెలిపారు. అదానీ ఎంటర్ప్రైజెస్ వార్షిక నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. వరుస కొనుగోళ్లు, తీవ్రమైన పరిశీలనలను ఎదుర్కొన్నప్పటికీ అదానీ గ్రూప్ Adani Group ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని, వ్యూహాత్మకంగా బలీయంగా ముందుకు సాగినట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గలేదని, బదులుగా తిరిగి బలీయమైనదిగా, విచ్ఛిన్నం కాలేని విధంగా మారమని చెప్పారు.