అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Trump) కీలక ప్రకటన చేశారు. వైట్ హౌస్‌లో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ (Starlink) సేవలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే టెస్లా కారు (Tesla Car)లో చక్కర్లు కొడతానని పేర్కొన్నారు.
డోనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన పన్ను తగ్గింపు బిల్లును ఎలాన్ మస్క్ (Elon Musk) వ్యతిరేకించాడు. దీనిపై స్పందించిన ట్రంప్ తాను అసలు పట్టించుకోనని వ్యాఖ్యలు చేశారు. తాను తెస్తున్న బిల్లు ద్వారా ప్రస్తుతం ఉన్న ఖర్చులు 1.6 ట్రిలియన్ డాలర్లు తగ్గుతాయన్నారు. కాగా తన వ్యాఖ్యలను పట్టించుకోనని ట్రంప్ అనడంపై మస్క్ ఎక్స్ వేదిక హాట్ కామెంట్లు చేశారు. తాను లేకపోతే ట్రంప్ ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోయేవారంటూ పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం చెడిందనే వార్తలు వచ్చాయి.
Donald Trump | ట్రంప్‌కు మద్దతు తెలిపిన మస్క్
లాస్ ఏంజెలెస్ (Los Angeles) నగరంలో జరుగుతున్న అలర్ల విషయంలో ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతు తెలిపారు. లాస్ ఏంజెలెస్ నగరంలో అల్లర్లను అణచివేయడానికి నేషనల్ గార్డ్స్‌ను వినియోగించడాన్ని సమర్థిస్తూ మస్క్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ వైట్ హౌస్‌లో స్టార్‌లింక్ సేవలు కొనసాగుతాయని చెప్పడం గమనార్హం.