అక్షరటుడే, వెబ్‌డెస్క్: US President | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US president donald trump) అధికారంలోకి వచ్చాక ఎవరిని నిద్ర పోనివ్వడం లేదు. ముఖ్యంగా అమెరికాలో (america) నివసిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి (green card holders) కూడా రక్షణ లేదు. ఇమ్మిగ్రేషన్ రూల్స్ (immigration rules) కఠినతరం చేస్తూ విద్యార్ధులని ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఎవరైతే విదేశీయులు అమెరికాలో నివసిస్తున్నారో వారికి షాక్ ఇచ్చేందుకు కొత్త పన్ను చట్టానికి ఆమోదం తెలపబోతున్నట్టు తెలుస్తుంది. మే 12న ప్రవేశ పెట్టిన బిల్లులో యూఎస్ నుండి ఇతర దేశాలకు అమెరికా పౌరసత్వం లేని వ్యక్తులు చేసే మనీ ట్రాన్సాక్షన్స్‌పై (money transaction) 5 శాతం పన్ను విధించాలని నిర్ణయించబడడం జరిగింది.
US President | పెద్ద షాకే..
ఈ నిర్ణయంతో అమెరికాలో తాత్కాలిక వర్క్ వీసాలు, స్టూడెంట్ వీసాలపై (work visa and student visa) నివసిస్తున్న లక్షల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా చాలా మంది భారతదేశంలోని (india) తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు యూఎస్ (US) నుండి డబ్బు పంపుతుంటారు. అయితే ఈ కొత్త పన్ను విధానంతో కాస్త టెన్షన్‌లో ఉన్నారు. ఈ కొత్త పన్ను విధానంలో రూ. లక్ష పంపితే రూ.వేల టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ట్రంప్ (trump) విధిస్తున్న పన్ను అమెరికాకు బిలియన్ డాలర్ల (america billion dollers) మేర సంపాదనను తెచ్చిపెడుతుందట.
ఏటా ప్రవాస భారతీయులు (indians) అమెరికాలో సంపాదించిన దానిని తమ కుటుంబ సభ్యులకు రూ. 7 లక్షల వరకు పంపిస్తూ ఉంటారు. ట్రంప్ చర్యల వలన అమెరికా నుండి పంపే ప్రతి రూ.లక్షలో రూ.5వేలు పన్ను రూపంలో కట్ అవుతుంది. ఇలా చేస్తే అమెరికాలో (America) నివసిస్తున్న బారతీయుల నుండి వచ్చే డబ్బు తగ్గిపోతుందని అంటున్నారు. సొంత దేశాలకు డబ్బు పంపే ధోరణిని ఇలా ట్రంప్ దెబ్బతీయడం అస్సలు బాలేదు అని అంటున్నారు. అమెరికా పరిపాలన భారతదేశం నుండి దిగుమతులపై 26 శాతం సుంకం విధించింది. ఇది చైనాపై (china) విధించిన 100 శాతం సుంకం కంటే చాలా తక్కువ. కానీ ట్రంప్ స్వరం అకస్మాత్తుగా ఎందుకు మారిపోయింది? దీనికి సమాధానం జెనీవాలో చైనా, అమెరికా (china and america) మధ్య జరిగిన వాణిజ్య చర్చలలో దొరుకుతుంది. ఈ ఒప్పందంలో, రెండు దేశాలు ఒకదానిపై ఒకటి తక్కువ సుంకాలను విధించుకోవడానికి అంగీకరించాయి. చైనా అమెరికాకు ఇంకా అనేక ఆఫర్లను ఇచ్చింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య సుంకాల యుద్ధాన్ని ముగించే అవకాశం పెరిగింది. ఈ ఒప్పందం కారణంగానే ట్రంప్ అకస్మాత్తుగా తన స్వరం మార్చుకుని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారని విశ్లేషకులు చెబుతున్నారు.
