అక్షరటుడే, వెబ్‌డెస్క్:America | భారత్ – పాకిస్తాన్(India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)కు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్‌పై దాడులు చేస్తోంది. పాక్(Pakistan) దాడులను భారత్(India) తిప్పికొడుతూ.. ఆ దేశంపై విరుచుకుపడుతోంది. రెండు దేశాల్లో బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో(US Secretary of State Mark Rubio) పాకిస్తాన్‌కు పోన్ చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్(Pak Army Chief Asim Munir)తో ఆయన మాట్లాడారు. కాల్పులు విరమించాలని పాక్‌ను కోరారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని రెండు దేశాలకు రుబియో సూచించాడు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలన్నారు. ఇరు దేశాల మధ్య చర్చల అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
