HomeUncategorizedTrump Tariff | టారిఫ్‌ వార్‌లో అమెరికా మార్కెట్లు కుదేలు.. బంగారంవైపు మళ్లుతున్న ఇన్వెస్టర్లు

Trump Tariff | టారిఫ్‌ వార్‌లో అమెరికా మార్కెట్లు కుదేలు.. బంగారంవైపు మళ్లుతున్న ఇన్వెస్టర్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Trump Tariff | అమెరికా అధ్యక్షుడు(America president) ట్రంప్‌, ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ల పరస్పర విరుద్ధ ధోరణులతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు(Stock markets) కుదేలవుతున్నాయి. ట్రంప్‌ ఇటీవల పొవెల్‌తోపాటు సెంట్రల్‌ బ్యాంక్‌పై చేసిన వ్యాఖ్యలతో మరింత అనిశ్చితి నెలకొంది. దీంతో యూఎస్‌ మార్కెట్లు సెల్లాఫ్‌కు లోనవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌(Dollar Index) మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది. సోమవారం డాలర్‌ ఇండెక్స్‌ 97.92 స్థాయికి పడిపోయి ఆ తర్వాత కోలుకుంది. 2022 మార్చి తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.

Trump Tariff | సురక్షిత పెట్టుబడులవైపు..

ట్రంప్‌ విధిస్తున్న టారిఫ్స్‌ వల్ల యూఎస్‌(US)కే నష్టమన్న అభిప్రాయాన్ని ఫెడ్‌ చైర్మన్‌ పొవెల్‌ వ్యక్తం చేస్తున్నారు. సుంకాలతో ద్రవ్యోల్బణం(Inflation) పెరిగే అవకాశాలుంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్లెషన్‌ పెరిగితే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు క్లిష్టంగా మారతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. దీనిని ట్రంప్‌(Trump) తప్పుపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పట్లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండదని అక్కడి ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ట్రంప్‌ విధించిన రెసిప్రోకల్‌ టారిఫ్స్‌తో మొదలైన ట్రేడ్‌వార్‌(Trade war) ఎటు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నవారు.. ఆర్థిక అనిశ్చిత పరిస్థితులలో ఈక్విటీ మార్కెట్‌కు బదులుగా బంగారం(Gold investment) వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్నారు. దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు పడిపోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో 19,280 పాయింట్ల వద్దనున్న నాస్‌డాక్‌(Nasdaq).. సోమవారం నాటికి 15,870 పాయింట్లకు పడిపోయింది.

వారం రోజుల్లోనే వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయింది. S&P సైతం ఈ ఏడాదిలో 700 పాయింట్ల వరకు క్షీణించింది. వారం రోజుల్లో సుమారు 300 పాయింట్ల వరకు నష్టాలను చవిచూసింది. మరోవైపు బంగారం ధర మాత్రం రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ పైపైకి ఎగబాకుతోంది. సోమవారం అమెరికా(America)లో ఔన్స్‌ బంగారం ధర 3,400 డాలర్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర 27 శాతం పెరగడం గమనార్హం.

Must Read
Related News