అక్షరటుడే, వెబ్‌డెస్క్: America | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో ఏడు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇప్పటికే 12 దేశాలపై పూర్తి నిషేధం అమలులో ఉంది. ప్రస్తుతం ఆ సంఖ్యం 19కి చేరింది.
ప్రయాణ, వలసల కోసం US ప్రవేశ ప్రమాణాలను కఠినతరం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ప్రయాణ ఆంక్షలు వచ్చాయి. ఇటీవల అమెరికా వైట్‌హౌస్ (White House) వద్ద అఫ్గనిస్థాన్‌కు చెందిన వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్ (National Guard) సభ్యులు చనిపోయారు. ఈ ఘటన అనంతరం ట్రంప్ మూడో ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వలసలు తగ్గిస్తామని, ఆయా దేశాల నుంచి వచ్చిన వారి శాశ్వత నివాస స్థితిని సమీక్షిస్తామన్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రావెల్ బ్యాన్ విధించారు.
America | ఏయే దేశాలు అంటే..
జాతీయ భద్రత, ప్రజా భద్రతా ముప్పుల నుంచి దేశాన్ని రక్షించడానికి తీవ్రమైన లోపాలు ఉన్న దేశాల నుంచి వచ్చిన పౌరులపై ప్రవేశ పరిమితులను విస్తరించడం, బలోపేతం చేయడం అనే ప్రకటనపై ట్రంప్ సంతకం చేశారని వైట్ హౌస్ తెలిపింది. తాజాగా విధించిన నిషేదం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. సిరియా, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, లావోస్, సియెర్రా లియోన్, మయన్మార్, చాడ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, హైతీ, ఎరిట్రియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, అఫ్ఘనిస్తాన్ దేశాలపై ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి. మరో 15 దేశాలపై పాక్షిక ఆంక్షలను ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తోంది.