అక్షరటుడే, వెబ్‌డెస్క్: Immigrants | అమెరికాలో అక్రమంగా జీవిస్తున్న వలసదారులపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు భారీ స్థాయిలో చర్యలు తీసుకున్నారు. నిన్న (జూన్ 4) ఒక్కరోజే సుమారు 2200 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు.
ఇది ఐసీఈ చరిత్రలో నమోదైన అత్యధిక అరెస్టుల గణాంకంగా గుర్తింపు పొందింది. ICE చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌కి “సెక్యూర్ బోర్డర్స్” (Secure Borders) అని నామకరణం చేశారు. అమెరికా-మెక్సికో సరిహద్దు వెంట కొనసాగిన ఈ దాడుల్లో టెక్సాస్, కెలిఫోర్నియా, అరిజోనా, న్యూమెక్సికో సహా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా దాడులు చేపట్టారు. వలసధారుల నివాస ప్రాంతాలు, వర్క్‌ప్లేస్‌లు, ట్రాన్స్‌పోర్ట్ హబ్(Transport Hub)లు తదితర చోట్ల ఉన్నచోటే అరెస్టులు జరిగాయి.
Immigrants | కఠిన నిర్ణయాలు..
అరెస్టు అయిన వలసదారుల కాళ్లకు బేడీలు వేసి, చేతులు కట్టి ప్రత్యేక ఐసీఈ వాహనాల్లో (ICE vehicles) తరలించిన తీరుపై తీవ్ర చర్చ మొదలైంది. కుటుంబాలతో జీవిస్తున్నవారిని కూడా విడదీసి తీసుకెళ్లిన దృశ్యాలు స్థానిక మీడియా కవర్ చేసింది. కొంతమంది చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ చర్యలపై మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా స్పందించాయి.
“ఇది మానవతా విరుద్ధ చర్య. ప్రజలను ఇలా దౌర్జన్యంగా అరెస్ట్ Arrest చేయడం సరికాదు,” అని ఓ మానవ హక్కుల కార్యకర్త విమర్శించారు. అదే సమయంలో, ఐసీఈ(ICE) మాత్రం తమ చర్యను సమర్థించుకుంటూ, ఇది దేశ భద్రత కోసం చేసిన చర్య. అమెరికా లోపలికి అక్రమంగా ప్రవేశించినవారు చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సిందే” అని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు దీనిపై ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ హోంమంత్రి మాత్రం మద్దతు తెలిపారు. “అక్రమ వలస ప్రవర్తనను నియంత్రించకపోతే దేశ భద్రతకు భయం ఉంటుంది. ఇందులో మేము రాజీ పడబోమని తెలిపారు. అరెస్ట్ చేసిన వారందరూ ఐసీఈ ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ (ఏటీడీ) ATD కార్యక్రమంలో నమోదు చేసుకున్నవారేనని తెలుస్తోంది. ఈ ఏటీడీ కార్యక్రమం కింద ప్రజా భద్రతకు ముప్పు కాని చట్టవిరుద్ధ వలసదారులను యాంకిల్ మానిటర్లు, స్మార్ట్‌ఫోన్ యాప్(Smartphone apps)లు లేదా ఇతర జియోలొకేటింగ్ ప్రోగ్రామ్(Geolocating program)ల ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణలో ఉంచుతారు. అలాగే ఐసీఈ కేంద్రాల్లో తరచూ తనిఖీలు ఉంటాయి.. ఒక్కరోజులో 2200 మందిని అరెస్టు చేయడం ద్వారా ఐసీఈ మరోసారి తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది. అయితే ఈ చర్యలు ఎంతవరకు దారితీస్తాయో అనేది వచ్చే రోజుల్లో తేలనుంది.
