ePaper
More
    Homeఅంతర్జాతీయంNuclear | ఇరాన్​ అణు కేంద్రాలపై ​ దాడులు.. రేడియేషన్​ తప్పదా..!

    Nuclear | ఇరాన్​ అణు కేంద్రాలపై ​ దాడులు.. రేడియేషన్​ తప్పదా..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nuclear : ఇరాన్​(Iran) – ఇజ్రాయెల్(Israel)​ మధ్య నెలకొన్న ఉద్రిక్తల్లో అమెరికా(America) ఎంటరైంది. ఇరాన్​ అణు స్థావరాలపై భీకర దాడులకు పాల్పడింది. దీంతో పశ్చిమాసియా (Middle East)లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కు మంటూ ఆందోళన చెందుతున్నారు.

    ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు పడ్డాయి. దీని ఫలితంగా హానికరమైన రేడియోధార్మికత బయటకు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనలు నెలకొంటున్నాయి. కానీ, ఇప్పటివరకూ ఈ పెను విపత్తుపై అధికారిక ప్రకటనలు వెలువడలేదు.

    Nuclear : అసలు ‘అణు’ అంటే ఏమిటి..

    అణురంగంలో ప్రధానంగా వినియోగించే ఇంధనం యురేనియం(uranium). భూగర్భ గని నుంచి దీనిని వెలికితీసినప్పుడు ఈ పదార్థంలో రెండు రకాలు (ఐసోటోపులు అనే పదార్థాలు) ఉంటాయి.

    • మొదటిటి యురేనియం-238 (యూ-238) uranium-238 (U-238). ముడి యురేనియంలో దీని పరిమాణం 99.3 శాతంగా ఉంటుంది.
    • ఇక రెండోది 2-235 (22-235). ఇది ముడి యురేనియంలో కేవలం 0.7 శాతమే ఉంటుంది.

    Nuclear : బాంబుకు ఎంత శుద్ధి అవసరం అంటే..

    • బాంబులు(BOmbs), అణు రియాక్టర్(nuclear reactor)​కు యూ-235 అవసరం. అణు విద్యుత్తు కేంద్రాల్లో(nuclear power plants) నియంత్రిత అణుచర్య జరిగి, దాని ద్వారా శక్తి విడుదలవుతుంది. ఈ కేంద్రాలకు యూ-235 వాటా 3-5 శాతంతో కూడిన ఇంధనం సరిపోతుంది.
    • అణుబాంబుకు వాడే ఇంధనంలో యూ-285 పరిమాణం 90 శాతం ఉండాలి.
    • అవసరమైన పరిమాణంలో యూ-235ను వెలికి తీసేందుకు ముడి ఖనిజాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది.
    • యురేనియం ఖనిజాన్ని మొదట యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే వాయువు రూపంలోకి మార్చుతారు. తర్వాత దానిని సెంట్రిఫ్యూజ్లోకి పంప్ చేస్తారు. ఈ యంత్రం అతి వేగవంతమైన భ్రమణాన్ని కలిగి ఉంటుంది. దీని ఫలితంగా ఉత్పన్నమయ్యే అపకేంద్రక శక్తి (సెంట్రిఫ్యూగల్ ఫోర్స్)తో యురేనియంలోని రెండు ఐసోటోపులు వేరు అవుతాయి.
    • ఇలా అవసరమైన స్థాయిలో శుద్ధి చేయడానికి ఈ ప్రక్రియను పలుమార్లు చేపడతారు. అణుశుద్ధి కేంద్రాల్లో జరిగే ప్రక్రియ ఇదే.
    • శుద్ధి చేసిన యురేనియం ఎంత ఎక్కువ ఉంటే అణువిచ్చిత్తి ప్రక్రియలో శక్తి విస్ఫోటం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది.
    READ ALSO  Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    Nuclear : ఇరాన్ ఎంత సాధించిందంటే..

    సుమారు 60 శాతం వరకు యురేనియం శుద్ధతను ఇరాన్ సాధించినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) మాట. అందువల్లే అణ్వస్త్ర సాధనకు గట్టిగా అడుగులు వేస్తోందనేది ఇజ్రాయెల్ అనుమానం. ఈక్రమంలోనే ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడికి పాల్పడింది.

    Nuclear : బుషిహెర్​పై దాడి ప్రమాదకరమే..

    బుషెహర్​(Bushehr)లోని అణువిద్యుత్తు కేంద్రంపై దాడి చేస్తే తీవ్ర ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. అక్కడ అతిపెద్ద అణురియాక్టర్లు ఉన్నాయి. వాటిని పేల్చేస్తే హానికరమైన రేడియోధార్మిక మూలకాలు బయటకు వస్తాయి. వీటి ఫలితంగా ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతోపాటు గల్ఫ్ ప్రాంతంలోని సముద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ఆ ప్రాంతంలో తాగునీటికి కటకట తప్పదు. ఎందుకంటే ఎడారి దేశాల్లో సముద్రజలాలను -నిర్లవణీకరణ చేసి తాగునీటికి వాడుతున్నారు.

    READ ALSO  Earthquake | రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    ఇరాన్​లోని నతాంజ్, ఇస్ఫాహన్, ఆరాక్, ఫోర్డో, నతాంజ్‌(Natanz, Isfahan, Arak, Fordow, Natanz) వంటి అణుకేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడికి పాల్పడ్డాయి. నతాంజ్​లోని యురేనియం శుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్లు ఐఏఈఏ పేర్కొంది. ఇస్ఫాహన్​లోని న్యూక్లియర్ కాంప్లెక్స్, కరాజ్, టెహ్రాన్​లోని సెంట్రిఫ్యూజ్ ఉత్పత్తి కేంద్రాల్లో భారీ డ్యామేజ్​ జరిగినట్లు తేల్చింది.

    ఆరాక్​లో నిర్మాణంలో ఉన్న భారజల పరిశోధన రియాక్టర్ సైతం దెబ్బతింది. భారజల రియాక్టర్లను ప్లుటోనియం ఉత్పత్తికి వినియోగిస్తారు. ఈ మూలకాన్ని సైతం అణుబాంబు తయారీలో వాడతారు. ఫోర్డ్లో మరో కేంద్రంలో భారీస్థాయిలో అణు ఇంధన శుద్ధికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెబుతున్నారు. కానీ, ఈ ఫోర్డో కేంద్రం ఒక పర్వతం కింద ఉంది. దీనిని ఛేదించాలంటే శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులు వినియోగించాల్సి ఉంటుంది. ఇలాంటి బాంబులు అమెరికా వద్ద మాత్రమే ఉండడం గమనార్హం.

    Nuclear : ఈ ఇంధనాన్ని పేల్చేస్తే ఏమవుతుందంటే..

    అణు రియాక్టర్, బాంబులో అణు విచ్ఛిత్తి ప్రక్రియ జరుతుంది. దీని తర్వాత విడుదలయ్యే రేడియోధార్మిక సీసియం, స్ట్రోనియం, అయోడిన్ వంటివే ప్రమాదకరం. ఇవే వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఇదే జరిగితే ప్రజారోగ్యానికీ హాని కలుగుతుంది. కాగా, ఇరాన్​లో దాడులకు గురైనచోట ఇప్పటి వరకు ఎలాంటి అణుచర్య జరగలేదు. అక్కడ రియాక్టర్లో యురేనియాన్ని ఇంధనంగా వాడడానికి సిద్ధం చేస్తున్నారు.

    READ ALSO  Typhoon Wipha Storm | చైనాలో తుపాన్​ బీభత్సం.. 400 భవనాలు ధ్వంసం

    శుద్ధి చేసిన యురేనియంలో సాధారణం కన్నా ఎక్కువగానే రేడియోధార్మికత ఉంది. ఎంత ఉన్నా కానీ, ఆ ఇంధన నిల్వలపైకి బాంబులను ప్రయోగిస్తే.. అణుచర్య ఉత్పన్నం కాదు. జపాన్​లోని పుకుషిమా(Fukushima), ప్రస్తుత ఉక్రెయిన్​లోని చెర్నోబిల్Chernobyl స్థాయి విపత్తు అయితే జరగదు. వాతావరణం కలుషితం భారీ స్థాయిలో ఉండే ముప్పు లేదని నిపుణులు చెబుతున్నారు.

    యురేనియం నుంచి వెలువడే రేడియోధార్మికత ఎక్కువ దూరం వ్యాపించదు. అణు ఇంధన నిల్వ ప్రదేశానికి అత్యంత సమీపంగా ఉండేవారికి మాత్రం ఆరోగ్య సమస్యలు రావొచ్చు. నతాంజ్ కేంద్రంపై బాంబుల దాడి జరిగాక నిర్దిష్టంగా ఆ కేంద్రంలోనే రేడియోధార్మికత ఏర్పడినట్లు ఐఏఈఏ పేర్కొంది.

    అణు శుద్ధి కేంద్రాలపై దాడి జరిగితే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో యురేనియం చెల్లాచెదురుగా పడుతుంది. దీనివల్ల రసాయన ముప్పు తప్పదు. అణు శుద్ధికేంద్రంలోని సెంట్రిఫ్యూజులు పేలి యురేనియం హెక్సాఫ్లోరైడ్ విడుదలైతే.. అది గాలిలోని తేమతో చర్యకు గురవుతుంది. ఫలితంగా తీవ్రస్థాయిలో గాఢత కలిగిన యాసిడ్, విషతుల్య పదార్థాలు విడుదలవుతాయి. యురేనియం రేణువులు శ్వాస, నోటి ద్వారా మానవ శరీరంలోకి చేరడం అత్యంత ప్రమాదకరం. అవి నేరుగా ఊపిరితిత్తులు, కడుపులోని కణాల్లోకి చేరి వాటిని దెబ్బతీస్తాయి.

    Latest articles

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న కీలక అంశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief...

    IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌ (Manchester Test match) లో ఇంగ్లండ్...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. గురువారం సెషన్‌లో యూఎస్‌,...

    More like this

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న కీలక అంశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief...

    IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌ (Manchester Test match) లో ఇంగ్లండ్...