అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hurricane Melissa | కరేబియన్ దేశం జమైకాలో భారీ విధ్వంసం సృష్టిస్తోంది హరికేన్ మెలిసా . అమెరికా వాతావరణ శాఖ నిపుణుల ప్రకారం, ఈ తుఫాను ఈ ఏడాది భూమిపై నమోదైన అత్యంత తీవ్రమైన హరికేన్లలో ఒకటిగా గుర్తించబడింది. ఇప్పటికే దీన్ని కేటగిరీ-5 హరికేన్‌గా వర్గీకరించారు.
అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ (NHC) వెల్లడించిన వివరాల ప్రకారం, హరికేన్ మెలిసా ప్రస్తుతం కరేబియన్ సముద్రం (Caribbean Sea)లోని పలు దీవులపై బీభత్సం సృష్టిస్తోంది. తుపానును అధ్యయనం చేసేందుకు అమెరికా వైమానిక దళానికి చెందిన USAF WC-130J హెరిక్యూలెస్ (TEAL 74) వెదర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆ ప్రాంతంలో రౌండ్లు వేసింది. ఆ సమయంలో తీసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Hurricane Melissa | తుపాను బీభత్సం..
వైరల్ వీడియోల్లో హరికేన్ మెలిసా (Hurricane Melissa) మధ్య భాగం ఆశ్చర్యకరంగా ప్రశాంతంగా కనిపిస్తుండగా, చుట్టూ మహాభీకరమైన తెల్లని మేఘాలు వలయాకారంలో తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తుపాను శక్తి ఎంత భయానక స్థాయిలో ఉందో ఆ దృశ్యాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.తుపాను ప్రభావంతో జమైకా (Jamaica)లో కుండపోత వర్షాలు, గాలివానలు కొనసాగుతున్నాయి. ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిస్తూ NHC డైరెక్టర్ మైఖేల్ బ్రెన్నాన్ అప్రమత్తత సూచనలు జారీ చేశారు. ఇదే సమయంలో జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ (Jamaica PM Andrew Holness) కూడా ప్రజలను ఇంట్లోనే ఉండాలని, అధికారుల ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలు గ్రామీణ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ప్రారంభించింది.
చరిత్రలో ఇదే మొదటిసారి జమైకా ఇంత తీవ్రత కలిగిన హరికేన్‌ను ఎదుర్కొంటోంది. గత 174 సంవత్సరాలుగా కేటగిరీ-4 లేదా అంతకంటే ఎక్కువ శ్రేణి తుఫాను ఆ దేశాన్ని తాకిన సందర్భం లేదు. చివరిసారిగా 1988లో హరికేన్ గిల్బర్ట్ జమైకాను తాకింది, అది కేటగిరీ-3 తుపాను మాత్రమే. ఆ తర్వాత ఇవాన్, బెరిల్ తుఫానులు కేటగిరీ-4 స్థాయిలో ఉన్నా, అవి తీరాన్ని తాకలేదు. కానీ ఈసారి మెలిసా నేరుగా భూభాగాన్ని తాకడం వల్ల భారీ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
🚨🇯🇲#BREAKING | NEWS ⚠️
New video from inside the eye of the hurricane Melissa, which is now a category 5 ⚠️ hurricane 🌀USAF C-130 J Hercules (#TEAL74) has made it inside the eye and wall of the hurricane incredible video images. Jamaica is in the crosshairs. They’ve had… pic.twitter.com/eUkOpQ54DM
— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) October 27, 2025

