అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారుల ఆదేశించారు. నగర శివారులోని ఖానాపూర్లో ఎరువుల గిడ్డంగి (Fertilizer Warehouse)ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Collector Nizamabad | అన్ని ప్రాంతాలకు ఎరువులు..
గోడౌన్లలో నిల్వ ఉన్న యూరియా ఇతర ఎరువులను పరిశీలించి స్టాక్ వివరాల రిజిస్టర్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Vinay Krishna Reddy) మాట్లాడుతూ రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు ఎరువులను చేరవేయాలని సూచించారు. రైతులు ఇబ్బందులు పడితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Collector Nizamabad | క్యూలైన్లలో నిలబడే పరిస్థితి రావొద్దు..
ఎక్కడ కూడా ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడటం వంటి పరిస్థితి రాకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. పంపిణీ ప్రక్రియను ప్రతిరోజు తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వ్యవసాయ అధికారి వీరస్వామి, సహకార శాఖ అధికారి రాజేశ్వర్ ఉన్నారు.భూభారతి (Bhubharati) పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి.
Collector Nizamabad | భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
అక్షరటుడే, ఆర్మూర్: భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నందిపేట మండల (Nandipet Mandal) కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష జరిపారు. నందిపేట మండలంలోని ఒక్కో గ్రామం వారీగా పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు.
Collector Nizamabad | అర్హులందరికీ న్యాయం జరగాలి..
అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అన్నారు. అర్జీలను తిరస్కరించినట్లైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్నచిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని, అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని హితవు పలికారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో తహశీల్దార్ సంతోష్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
