అక్షరటుడే, వెబ్బెస్క్ : Urea Shortage | రాష్ట్రంలో యూరియా కొరత(Urea Shortage)మరింత తీవ్రమైంది. సరిపడా స్టాక్ లేకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. అన్నదాతలు ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాల ఎదుట బారులు తీరుతున్నారు.
తెల్లవారక ముందు నుంచే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూ లైన్ లో నిలుచున్న యూరియా దొరకకపోవడం కష్టంగా మారింది. చాలా జిల్లాల్లో యూరియా లేక రైతులు(Farmers) ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ(Nalgonda)లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
Urea Shortage | అదును దాటుతున్నా..
రాష్ట్రంలో వరి నాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్ లాంటి జిల్లాల్లో ముందు వేసిన పొలాలకు రెండో దఫా మందు చల్లాల్సి ఉండగా, ఆలస్యంగా వేసిన చోట్ల మొదటి దఫా చల్లాల్సి ఉంది. అలాగే, మక్కకు కూడా రెండో విడుత మందు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సరిపడా స్టాక్ లేక కొరత ఏర్పడింది. కేంద్రం నుంచి తగినంతగా యూరియా రాకపోవడం, అదే సమయంలో డిమాండ్ పెరుగడంతో రాష్ట్రప్రభుత్వం(State Government) కూడా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో అడపాదడపా వస్తున్న యూరియా కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాల్సి వస్తున్నది.
Urea Shortage | ఎక్కడ చూసినా బారులు..
యూరియా స్టాక్ వచ్చిందని తెలిస్తే చాలు రైతులు సొసైటీల వద్దకు పరుగులు పెడుతున్నారు. నల్లగొండ జిల్లాలోని ఏ సొసైటీ వద్ద చూసినా చెప్పులు, పాస్ పుస్తకాల వరుసలు కనిపిస్తున్నాయి. సోమవారం అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరారు. కనీసం నీళ్లు కూడా లేకుండా కడుపు మాడ్చుకుని యూరియా వరుసులో నిల్చున్నారు. అడ్డగూడూర్(Addagudur) లో సింగిల్ విండో కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు వరుస కట్టారు. మిర్యాలగూడ మండలం అలగడప సొసైటీలో యూరియా కోసం లైన్ లో పెట్టిన చెప్పులు వేచి ఉన్నారు. నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం రైతు(Yellareddygudem Farmer) వేదిక వద్ద యూరియా కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. త్రిపురారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలి వచ్చారు.