Urea Farmers Protest | యూరియా కోసం రైతుల నిరసన.. ఏరాజ్​పల్లిలో ఘటన

ప్రభుత్వం యూరియాను సకాలంలో అందించట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బోధన్​ మండలం ఏరాజ్​పల్లిలో గురువారం ధర్నా నిర్వహించారు.

అక్షరటుడే, బోధన్: Urea Farmers Protest | ప్రభుత్వం యూరియాను సకాలంలో అందించట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బోధన్​ మండలం (Bodhan Mandal) ఏరాజ్​పల్లిలో గురువారం ధర్నా నిర్వహించారు.

Urea Farmers Protest | యూరియా గోదాం వద్ద..

గ్రామ రైతు నడిపి గంగారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కొన్నిరోజులుగా యూరియా సరైన రీతిలో అందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత లేకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రైతాంగం రోడ్డుపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

యూరియా యాప్​తో కష్టాలు..

యూరియా కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్​తో అనేక కష్టాలు వస్తున్నాయని రైతులు ఆరోపించారు. ఎప్పుడు లేని ఆన్​లైన్​ యాప్​ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం (State Government) యూరియా అమ్మాకాలు చేపడుతుండడంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇది వరకు ఉన్నట్లుగానే యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.

NCERT Book Ban | ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. పుస్తకంపై నిషేధం

ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదో తరగతి సోషల్​ సైన్స్​ పుస్తకాన్ని నిషేధించింది.

Chain Snatching Kotagiri | కోటగిరిలో చైన్​స్నాచింగ్​.. మూడు తులాల గొలుసు అపహరణ..

జిల్లాలో వరుస చైన్​స్నాచింగ్​ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు.

Holi Special Trains | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. హోలీకి ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1,244 ట్రిప్పులు వేసినట్లు పేర్కొంది.